Magazines

సీఈసీ రాజీనామా చేసే వరకు పోరాటం ఆగదు: జాన్‌ బ్రిట్టాస్‌

11 గంటల క్రితం

John Brittas
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 09, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేష్‌ కుమార్‌ రాజీనామా చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని సీపీఐ(ఎం) రాజ్యసభ సభ్యులు జాన్‌ బ్రిట్టాస్‌ స్పష్టం చేశారు.ఓట్ల చోరీపై ఇండియా బ్లాక్‌ ఎంపిలు గత కొన్ని రోజులుగా ఢిల్లీలో నిరసన చేపడుతున్నారని అన్నారు. ఈ ఆందోళనను మరింత ఉధృతం చేసేందుకు భవిష్యత్‌ కార్యాచరణను రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా గురువారం మహాత్మా గాంధీ సమాధి రాజ్‌ఘాట్‌ను సందర్శించామని, శుక్రవారం పాత పార్లమెంటు భవనంలోని సంవిధాన్‌ సదన్‌లో సమావేశమై తదుపరి కార్యాచరణపై చర్చిస్తున్నామని వెల్లడించారు. తాము లేవనెత్తిన అంశాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దృష్టికి తీసుకెళ్లేందుకు కూడా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.


మరోవైపు, శనివారం ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద విద్యార్థులు, యువత నిరసనకు సిద్ధమవుతున్న నేపథ్యంలో, వారు రాజధానికి చేరుకోకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని బ్రిట్టాస్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనల్లో పాల్గొనవద్దంటూ ఢిల్లీ పోలీసులు మసీదులకు వెళ్లి మరీ కోరుతున్నారని, ఇది ముస్లిం సమాజానికి పరోక్ష హెచ్చరికగా ఉందని విమర్శించారు. అయినప్పటికీ తమ ఆందోళనను విరమించబోమని స్పష్టం చేశారు. తాము లేవనెత్తిన సమస్యలు, డిమాండ్ల ప్రాధాన్యతను వివరించేందుకు రాష్ట్రపతిని కలవాలని భావిస్తున్నామని, ఆమె తమ వాదనలను వింటారని ఆశిస్తున్నామని బ్రిట్టాస్‌ పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్