Magazines

వచ్చే ఎన్నికల్లో హుజూర్‌నగర్ నుంచే పోటీ: మంత్రి ఉత్తమ్‌

4 గంటల క్రితం

Minister Uttam
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 03, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌: నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాలకు తెరదించారు. వచ్చే ఎన్నికల్లో తాను హుజూర్‌నగర్ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని ఆయన స్పష్టం చేశారు. డీలిమిటేషన్ తర్వాత తుంగతుర్తికి మారవచ్చంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. ప్రస్తుతం ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

శనివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి... తన నియోజకవర్గం మార్పుపై వస్తున్న వదంతులను ఎవరూ నమ్మవద్దని కోరారు. తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని తన స్వగ్రామం తాటిపాములలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని, అంతమాత్రాన అక్కడి నుంచి పోటీ చేస్తాననడం అవాస్తవమని తెలిపారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్