Magazines

విదేశీ ఇన్వెస్టర్లకు రెడ్‌‌కార్పెట్‌..!

3 రోజుల క్రితం

Red carpet for foreign investors!
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది సెప్టెం 23, 2026 | 1 నిమిషాల చదవడం

ఎఫ్‌పిఐల కోసం మరిన్ని సంస్కరణలు
మార్కెట్లలో డిజిటల్‌ అన్‌‌బోర్డింగ్‌ వేగవంతం
సెబీ ఛైర్మన్‌ తుహిన్‌ కాంతా పాండే వెల్లడి
న్యూఢిల్లీ: భారత పెట్టుబడి మార్కెట్లలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పిఐ)లకు సెబీ రెడ్‌‌కార్పెట్‌ ‌వేస్తోంది. విదేశీ పెట్టుబడిదారుల ప్రవేశాన్ని మరింత సులభతరం చేసేందుకు సెబీ సంస్కరణలను వేగవంతం చేసింది. ఇందుకు వీలుగా ఆన్‌బోర్డింగ్‌ను వేగవంతం చేయడంతో పాటు డిజిటల్‌ విధానాలను విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సెబీ చైర్మన్‌ తుహిన్‌ కాంతా పాండే తెలిపారు. మంగళవారం జెపి మోర్గాన్‌ ఇండియా సదస్సులో ఆయన మాట్లాడుతూ.. విదేశీ ఇన్వెస్టర్లు ఎదుర్కొంటున్న అనవసరమైన ఆటంకాలను తొలగించడమే లక్ష్యమని చెప్పారు. విదేశీ పెట్టుబడిదారుల ప్రవేశ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు డిజిటల్‌, రిస్క్‌కు అనుగుణంగా మార్చుతున్నట్లు పాండే తెలిపారు. తక్కువ రిస్క్‌ ఉన్న ఎఫ్‌పిఐల కోసం రూపొందించిన ‘స్వాగత్‌-ఎఫ్‌ఐ’ విధానం ద్వారా 2026 జూన్‌ 1 నుంచి ఇప్పటివరకు సుమారు 205 ఎఫ్‌పిఐలు ప్రయోజనం పొందినట్లు వెల్లడించారు. ఎఫ్‌పిఐల ఆన్‌బోర్డింగ్‌ సమయాన్ని తగ్గించేందుకు డిజిటల్‌ వర్క్‌ఫ్లోలు, ఎపిఐ ఆధారిత అనుసంధానాన్ని ఉపయోగిస్తున్నామన్నారు. భవిష్యత్తులో వీటిని మరింత విస్తరిస్తామని చెప్పారు. పెట్టుబడిదారులు క్రెడిట్‌ రిస్క్‌ను సులభంగా అర్థం చేసుకునేందుకు క్రెడిట్‌ రిస్క్‌-ఓ-మీటర్‌ ప్రతిపాదనను కూడా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. విదేశీ సెక్యూరిటీల్లో పెట్టుబడులకు అవకాశం కల్పించేలా అక్రెడిటెడ్‌ ఇన్వెస్టర్‌ విధానాన్ని సమీక్షిస్తున్నామని పాండే తెలిపారు. భారత్‌ నుంచి ప్రపంచస్థాయి ఫండ్‌ మేనేజ్‌మెంట్‌ కార్యకలాపాలను నిర్వహించేందుకు వీలుగా కొత్త విధివిధానాలను రూపొందించే అంశంపైనా కసరత్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్