Magazines

భగత్‌సింగ్ స్వాతంత్ర సంగ్రామ పోరాటం అమరం

49 నిమిషాల క్రితం

sattupally
avatar
Shiva Kumar

ప్రచురించబడింది సెప్టెం 28, 2026 | 1 నిమిషాల చదవడం

- ఏఐవైఎఫ్ రాష్ట్ర నాయకులు శ్రావణ్ కుమార్ 

- సత్తుపల్లి టు భగత్ సింగ్ 119వ జయంతి సభ

 నవతెలంగాణ-సత్తుపల్లి

 సత్తుపల్లిలో అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) ఆధ్వర్యంలో సోమవారం భగత్‌సింగ్ 119వ జయంతి సభను ఘనంగా నిర్వహించారు.  ఈ సభలో ఏఐవైఎఫ్ రాష్ట్ర నాయకుడు శ్రావణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్వాతంత్ర్య సంగ్రామంలో భగత్‌సింగ్ వహించిన పాత్ర చరిత్రలో చిరస్మరణీయమని, ఆయన పోరాట చరిత్రను ఎన్నిసార్లు చదివినా తనివి తీరదని కొనియాడారు. తెల్లోళ్లపై ఆనాడు ఆయన చూపిన పోరాట స్ఫూర్తితో నేటి యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి నిరుద్యోగులను మోసం చేసిందని మండిపడ్డారు.


ఉద్యోగాలు అడిగితే మత విద్వేషాలు రెచ్చగొడుతూ, ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని విమర్శించారు. దేశంలో యువత చైతన్యవంతమైతే తట్టుకునే శక్తి ప్రభుత్వాలకు లేదన్నారు. ​ఇటు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎన్నికల ముందు ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి, యూత్ డిక్లరేషన్ హామీలను తుంగలో తొక్కుతోందని ధ్వజమెత్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో భగత్‌సింగ్ స్ఫూర్తితో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ సభలో సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి దండు ఆదినారాయణ, ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు నిమ్మటూరి రామకృష్ణ, రమేష్, నరేష్, హరినాథ్, గోపి పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్