Magazines

కాంగ్రెస్ మండల కార్యదర్శిగా కొండా జయరాజు నియామకం 

1 గంట క్రితం

sattupally
avatar
Shiva Kumar

ప్రచురించబడింది సెప్టెం 28, 2026 | 1 నిమిషాల చదవడం

- కోశాధికారిగా నీలాల నరసింహారావు

నవతెలంగాణ-సత్తుపల్లి 

​సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ సిఫారసు మేరకు మండల కాంగ్రెస్ పార్టీ సంస్థ గత నియామకాలు చేపట్టారు. అందులో భాగంగా మండల పార్టీ కార్యదర్శిగా రామానగరానికి చెందిన కొండా జయరాజు, కోశాధికారిగా అదే గ్రామానికి చెందిన నీలాల నరసింహారావు నియమితులయ్యారు.


ఈ మేరకు సోమవారం కాంగ్రెస్ మండల అధ్యక్షుడు భీమిరెడ్డి సుబ్బారెడ్డి చేతుల మీదుగా వారు నియామక పత్రాలను అందుకున్నారు. ఈ సందర్భంగా జయరాజు, నరసింహారావు మాట్లాడుతూ... తమపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన ఎమ్మెల్యే రాగమయి దయానంద్, నాయకులు దయానంద్ విజయకుమార్ లకు  ధన్యవాదాలు తెలిపారు. ​తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. నాయకుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా, ఎలాంటి స్వార్థం లేకుండా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తామని వారు పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్