నవతెలంగాణ - భీంగల్
భీంగల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి బోదిరే నాగమణి స్వామి, కమిషనర్ డి.గజానంద్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు తోట సతీష్, మహమ్మద్ అంజుం అలీ, పర్ష కుశలతఅనంతరావు, సందీప్ పాల్గొని గాంధీజీకి నివాళులర్పించారు. ప్రజా ప్రతినిధులు జై జై నర్సయ్య, బోదిరే నర్సయ్య, మల్లెల ప్రసాద్ తదితరులు గాంధీజీ సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మహాత్మా గాంధీ చూపిన అహింస, సత్యం, శాంతి మార్గాలు నేటి సమాజానికి కూడా ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ పాటిస్తూ సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.







కామెంట్లు (0)