నవతెలంగాణ-మల్హర్ రావు
జాతిపిత మహాత్మాగాంధీ జయంతి ఉత్సవాలను పురస్కరించుకునిమండల కేంద్రమైన తాడిచెర్లలో వైశ్య సంఘం, వాసవి క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ విగ్రహానికి వైశ్య సంఘం మండల అధ్యక్షుడు కుక్కడపు వెంకటేశ్వర్లు, ప్రజాప్రతినిధులు,నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గాంధీ సేవలను స్మరించుకున్నారు. అహింస, సత్యాగ్రహం, శాంతి మార్గంలో గాంధీజీ చూపిన బాటను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బండి స్వామి, ఉప సర్పంచ్ బొబ్బిలి రాజు గౌడ్, వైశ్య సంఘం నాయకులు ఓల్లాల రమేష్, ప్రసాద్, కుక్కడపు అశోక్, సత్యనారాయణ, రేపాల హరీష్, కోడీమ్యాల భాస్కర్, యంసాని రాజు, శివ, కాంగ్రెస్ నాయకులు కేశారపు చెంద్రయ్య, బండి రాజయ్య, ఆకుల శ్రీనివాస్, రాజ సమ్మయ్య, సంపత్ పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)