Magazines

ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటా 

57 నిమిషాల క్రితం

every worker
avatar
Shiva Kumar

ప్రచురించబడింది సెప్టెం 28, 2026 | 1 నిమిషాల చదవడం

మహాబాద్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్

​పాడే పట్టిన సర్పంచ్ బోడ నరసింహ నాయక్ 

​నవతెలంగాణ-నెల్లికుదురు 

​బి ఆర్ ఎస్ పార్టీ ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటానని మహబూబాద్ మాజీ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ అన్నారు. సోమవారం మండలంలోని సంధ్య తండ గ్రామానికి చెందిన ఆ పార్టీ నాయకుడు బానోతు రాజు మృతి చెందడంతో ఆయన స్వగృహానికి వెళ్లి కాస్య తండా సర్పంచ్ నరసింహ నాయక్ తో కలిసి మృతుని పార్ధవ దేహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఆ గ్రామ సర్పంచ్ బోడ నరసింహ నాయక్ పాడె పట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో సంధ్య తండా కు చెందిన రాజు అనే వ్యక్తి మృతి చెందడం ఎంతో బాధాకరమని అన్నారు. ఆయన గ్రామ అభివృద్ధికి పార్టీ అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన గొప్ప వ్యక్తి అని ఈ సందర్భంగా తెలిపారు. ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు అన్ని విధాలుగా మా వంతు కృషి చేస్తామని చెప్పారు. మృతి చెందిన కుటుంబానికి ప్రతి ఒక్కరు అండగా నిలవాలని ఈ సందర్భంగా కోరారు. అంతేకాకుండా టిఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్తకు ఏ ఆపద వచ్చిన వెంటనే వారి సమస్య పరిష్కారం అయ్యేంతవరకు పోరాడుతానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆ గ్రామ సర్పంచ్ బోడ నరసింహ నాయక్ , శ్రీను , సోములు ,కాసిమ్ ,అనిల్ , నవీన్ , స్వామి,యూత్ నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు. 

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్