Magazines

వన్యప్రాణుల సంరక్షణ బాధ్యతగా తీసుకోవాలి 

1 గంట క్రితం

plants
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 02, 2026 | 1 నిమిషాల చదవడం

జిల్లా అటవీ శాఖ అధికారిని బాలమణి 

జిల్లాలో ప్రారంభమైన జాతీయ వన్యప్రాణి వారోత్సవం 

నవతెలంగాణ-ఆసిఫాబాద్

వన్యప్రాణుల సంరక్షణ ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని జిల్లా అటవీశాఖ అధికారిని బాలమణి తెలిపారు. జాతీయ వన్యప్రాణి వారోత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయం నుండి గిరిజన సంక్షేమ క్రీడా పాఠశాల విద్యార్థులతో కలిసి నిర్వహించిన ర్యాలీకి ఆసిఫాబాద్ ఎఫ్ ఆర్ ఓ గోవింద్ చంద్ సర్దార్ తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజల్లో వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన కల్పించే ఉద్దేశంతో 1955 నుండి నిర్వహిస్తున్న వారోత్సవాల్లో భాగంగా ప్రత్యేకంగా వారం రోజులపాటు అంటే ఈ నెల 8వ తారీకు వరకు జాతీయ వన్యప్రాణి వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.


జిల్లావ్యాప్తంగా పాఠశాలల్లో గ్రామాల్లో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వన్యప్రాణులతో వాతావరణ సమతౌల్యం సాధ్యమవుతుందని తెలిపారు. ప్రజల సహాయ సహకారాలు ఉన్నప్పుడే జంతువుల సంరక్షణ సాధ్యమవుతుందన్నారు. గతంతో పోలిస్తే వన్యప్రాణుల జనాభా కొంత పెరిగిందని మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలోని ప్రజలకు వన్యప్రాణి వారోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్ అధికారులు యోగేష్, ఝాన్సీ రాణి, సెక్షన్ అధికారులు మహేందర్, సాయి, మల్లయ్య, సతీష్, గిరిజన సంక్షేమ క్రీడా పాఠశాల పిడి మీనా రెడ్డి, బీట్ అధికారులు విద్యార్థులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్