Magazines

నిరసనలతో హోరెత్తిన ఫ్రాన్స్...

21 గంటల క్రితం

protests
avatar
balaji

ప్రచురించబడింది నవం 06, 2026 | 2 నిమిషాల చదవడం

లక్షలాది మందితో ప్రదర్శనలు..సార్వత్రిక సమ్మె

స్తంభించిన జనజీవనం..నిలిచిపోయిన చమురు ఉత్పత్తి

స్తంభించిన జనజీవనం... నిలిచిపోయిన చమురు ఉత్పత్తి


పారిస్ : నిరసనలు, ఆందోళనలు, సార్వత్రిక సమ్మెలతో ఫ్రాన్స్ అట్టుడికిపోతోంది. ఐదు కార్మిక సంఘాల పిలుపు మేరకు గురువారం జరిగిన ప్రదర్శనలు, సమ్మెలో లక్షలాది మంది భాగస్వాములయ్యారు. పాఠశాలల దుస్థితి, జీవనవ్యయం పెరుగుదలకు వ్యతిరేకంగా దేశంలో గత కొన్ని వారాలుగా ఆందోళనలు చెలరేగుతున్న విషయం తెలిసిందే. గురువారం జరిగిన సమ్మెతో ప్రజాజీవనం స్తంభించింది. రవాణా, పాఠశాలలు, ఆస్పత్రులు, ప్రభుత్వ కార్యాలయాల సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యార్థులు, ఉద్యోగులు, యువత, కార్మికులు సహా సుమారు ఐదు లక్షల మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసనగళం వినిపించారు. రిఫైనరీ కార్మికులు కూడా సమ్మెలో చేయడంతో చమురు ఉత్పత్తి నిలిచిపోయింది. అణు విద్యుత్ కేంద్రాల్లో ఏర్పడిన అంతరాయాల కారణంగా ఫ్రాన్స్ తన అవసరాల కోసం ఇతర దేశాల నుంచి కరెంటును దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.జీవనవ్యయం పెరిగిన కారణంగా దానికి అనుగుణంగా తమ కనీస వేతనాలను పెంచాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వం ప్రతిపాదించిన 2027 ముసాయిదా బడ్జెట్‌లో సామాజిక ప్రయోజనాలకు నిధులు నిలిపివేయడాన్ని, ప్రజా సేవలకు నిధులు తగ్గించడాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

మెరుగైన పెన్షన్లు, నిస్పాక్షిక పన్ను విధానం, పర్యావరణ పరిరక్షణకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. నిరసనల కారణంగా ఉద్రిక్తతలు చెలరేగకుండా నివారించేందుకు దేశవ్యాప్తంగా 70 వేల మంది పోలీసులను మోహరించారు. గత మూడు వారాలుగా కొనసాగిన నిరసనల్లో కొన్ని చోట్ల అల్లర్లు, దాడులు జరగడంతో పోలీసులు భాష్పవాయు గోళాలను ప్రయోగించిన విషయం తెలిసిందే. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఇప్పటి వరకూ వేలాది మందిని అరెస్ట్ చేశారు. నగర కేంద్రాల్లోని వ్యాపార సముదాయాలు, ప్రభుత్వ భవనాలకు నష్టం కలగకుండా కఠిన నిబంధనలను అమలు చేస్తున్నారు. ప్రధాన నగరాల్లోని రైల్వే స్టేషన్లు, మున్సిపల్ కేంద్రాల వద్ద నిరసనకారులు భారీగా గుమిగూడారు. లియాన్, మార్సేయి, టౌలౌస్, నాంటెస్ వంటి నగరాల్లోని ప్రధాన వ్యాపార వీధులు, ప్రభుత్వ భవనాల పరిసన ప్రాంతాలు నిరసనలతో హోరెత్తుతున్నాయి. అల్లర్లు జరిగే అవకాశమున్న నగరాల్లో పోలీసులు రాత్రి సమయంలో కర్ఫ్యూ విధించారు. కీలకమైన ప్రభుత్వ కార్యాలయాలు, పర్యాటక ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు జరపకుండా నిషేధాజ్ఞలు విధించారు. ప్రదర్శనలు జరిగే మార్గాల్లోని పలు కీలక భూగర్భ మెట్రో స్టేషన్లను భద్రతా కారణాల రీత్యా తాత్కాలికంగా మూసివేశారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్