హాంగ్‌కాంగ్ : భారత అగ్రశ్రేణి షట్లర్ లక్ష్యసేన్ హాంగ్‌కాంగ్ ఓపెన్ సూపర్ 500 టోర్నీలో సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. శుక్రవారం కాయ్ తక్ స్పోర్ట్స్ పార్క్‌లో జరిగిన మెన్స్ సింగిల్స్ క్వార్టర్స్‌లో లక్ష్యసేన్ 21-17, 10-21, 21-3తో సింగపూర్ షట్లర్‌పై గెలుపొంది సెమీస్‌కు చేరుకున్నాడు. మెన్స్ డబ్సుల్‌లో సాత్విక్, చిరాగ్ జోడీ 21-12, 13-21, 21-16తో చైనా షట్లర్లపై మూడు గేముల మ్యాచ్‌లో గెలుపొందారు. మహిళల సింగిల్స్‌లో రక్షిత శ్రీ 19-21, 16-21తో ఐదో సీడ్ చొచువాంగ్ చేతిలో ఓటమి చెందింది. కిదాంబి శ్రీకాంత్ 17-21, 7-21తో కునాల్‌విట్ చేతిలో వరుస గేముల్లో నిరాశపరిచాడు. నేడు సెమీస్‌లో ఆంటోన్సెన్‌తో లక్ష్యసేన్.. మలేషియా జోడీతో సాత్విక్, చిరాగ్‌లు ఆడనున్నారు.







కామెంట్‌లు (0)