భారత్, న్యూజిలాండ్ తొలి వన్డే నేడు
ఉదయం 7.30 నుంచి సోనీనెట్వర్క్లో..
ఆక్లాండ్ (న్యూజిలాండ్)
భారీ స్కోర్ల టీ20 సిరీస్ తర్వాత భారత్, న్యూజిలాండ్ వన్డే సవాల్‌కు సిద్దమయ్యాయి. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ జోడీ వన్డేల్లో ఆడనుండటం భారత డ్రెస్సింగ్రూమ్తో పాటు అభిమానుల్లోనూ జోష్ నింపనుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్ నేడు ఆక్లాండ్‌లో తొలి వన్డేతో ఆరంభం కానుంది. టీ20 సిరీస్‌ను కోల్పోయినా, ఆఖరు రెండు మ్యాచ్‌ల్లో పుంజుకున్న న్యూజిలాండ్ అదే ఉత్సాహంతో వన్డే సిరీస్‌కు సై అంటోంది. ఇక్కడ జరిగిన టీ20లో న్యూజిలాండ్ రికార్డు 259 పరుగులు చేసింది. దీంతో నేడు వన్డేలోనూ భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్‌లతో పాటు నమన్ ధీర్ వన్డే జట్టులో ఆడనున్నాడు. పేస్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి, స్పిన్ ఆల్‌రౌండర్‌గా అక్షర్ పటేల్ జట్టులో నిలువనున్నారు. మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్‌లు పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లిలతో కూడిన భారత టాప్ ఆర్డర్ పరుగుల దాహంతో కనిపిస్తోంది. న్యూజిలాండ్‌కు గాయాల దెబ్బ గట్టిగానే తగిలింది. డెవాన్ కాన్వే కంకషన్తో దూరం కాగా, మార్క్ చాప్మన్, రచిన్ రవీంద్ర సిరీస్‌కు దూరమయ్యారు. విల్ యంగ్, గ్లెన్ ఫిలిప్స్‌తో పాటు డార్లీ మిచెల్, టామ్ లేథమ్ న్యూజిలాండ్‌కు కీలకం కానున్నారు. భారత్, న్యూజిలాండ్ తొలి వన్డే నేడు ఉదయం 7.30 గంటలకు ఆరంభం కానుంది.







కామెంట్లు (0)