Magazines

నేటి నుంచి ఫీనిక్స్‌ గోల్ఫ్‌ టోర్నమెంట్‌

3 గంటల క్రితం

Golf
avatar
balaji

ప్రచురించబడింది నవం 10, 2026 | 1 నిమిషాల చదవడం

బరిలో స్టార్‌ గోల్ఫర్లు గగన్‌‌జీత్‌, సచిన్‌, ఉదయన్‌

‌నవతెలంగాణ-హైదరాబాద్‌ : ఏఎం గ్రీన్‌ ఇండియన్‌ ‌గోల్ఫ్‌ ‌ప్రీమియర్‌ ‌లీగ్‌ (ఐజీపీఎల్‌)‌లో భాగంగా తెలంగాణలో రెండో టోర్నమెంట్‌‌కు రంగం సిద్ధమైంది. అక్టోబర్‌‌లో హెచ్‌‌జీఏ వేదికగా కృష్ణ ఇన్విటేషనల్‌ ‌జరుగగా, తాజాగా వూటీ కౌంటీ వేదికగా ఫీనిక్స్‌ ఇన్విటేషనల్‌ ‌టోర్నమెంట్‌ ‌నేటి నుంచి షురూ కానుంది. ‌ఫీనిక్స్‌ హైదరాబాద్‌ ‌ఫైర్‌‌బర్డ్స్‌ జీసీ గోల్ఫర్‌ ‌సచిన్‌ ‌బైసోయా టైటిల్‌‌పై కన్నేయగా.. ఈ సీజన్లో ఆరు టైటిల్స్‌‌తో జోరుమీదున్న గగన్‌‌జీత్‌ ‌బుల్లార్‌ ‌సైతం ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్నాడు. హైదరాబాద్‌‌తో పాటు వైజాగ్‌‌లో జరిగిన టోర్నీలో గగన్‌‌జీత్‌ ‌విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఫీనిక్స్‌ ఇన్విటేషనల్‌‌కు వూటీ కౌంటీ ఆతిథ్యం ఇవ్వనుండగా.. ఐజీపీఎల్‌ ‌పది ప్రాంఛైజీలు టీమ్‌ ‌ఫార్మాట్‌‌లో పోటీపడే ఎక్స్‌ ‌గోల్ఫ్‌ ఈవెంట్‌‌కు హైదరాబాద్‌‌లోని బౌల్డర్‌ ‌హిల్స్‌ ‌వేదిక కానుంది. ఈ మేరకు నిర్వాహకులు ఐజీపీఎల్‌ ‌సీఈవో ఉత్తమ్‌ ‌సింగ్‌ మండే మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ‌ఫీనిక్స్‌ హైదరాబాద్‌ ‌ఫైర్‌‌బర్డ్స్‌ జట్టులో ‌సచిన్‌ ‌బైసోయాతో పాటు అర్జున్‌ ‌భాటి, రంజిత్‌ ‌సింగ్‌, రాఘవ్‌ ‌చుగ్‌‌లు సత్తా చాటేందుకు ఎదురుచూస్తున్నారు. ఫీనిక్స్‌ ‌హైదరాబాద్‌ ‌ఫైర్‌‌బర్డ్స్‌ ‌జీసీ ఆటగాళ్లతో కలిసి ట్రోఫీని ఉత్తమ్‌ ‌సింగ్‌ ఆవిష్కరించారు. 11 నుంచి 13 వరకు ఇన్విటేషనల్‌ ఈవెంట్‌ ‌జరుగనుండగా, 14న ఎక్స్‌ ‌గోల్ఫ్‌ ‌షెడ్యూల్‌ ‌చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్