Magazines

వరుణుడి ఖాతాలో..

3 గంటల క్రితం

Varuna’s
avatar
balaji

ప్రచురించబడింది నవం 10, 2026 | 1 నిమిషాల చదవడం

భారత్‌, కివీస్‌ ‌మూడో వన్డే వర్షార్పణం

హామిల్టన్‌ (‌న్యూజిలాండ్‌) : భారత్‌, న్యూజిలాండ్‌ ‌వన్డే సిరీస్‌‌ను వెంటాడుతున్న వరుణుడు.. ఎట్టకేలకు ఓ వన్డేను ఖాతాలో వేసుకున్నాడు. నిలకడగా వర్షం కురవటంతో పిచ్‌ ‌తయారు చేసేందుకు సైతం క్యూరేటర్‌‌కు సమయం లభించని పరిస్థితుల్లో హామిల్టన్‌ ‌వన్డే వర్షార్పణమైంది. చిరుజల్లులు, వర్షం కాసేపు విరామం ఇవ్వగా.. టాస్‌ ‌పడింది. టాస్‌ ‌నెగ్గిన శుభ్‌‌మన్‌ ‌గిల్‌ ‌బౌలింగ్‌ ఎంచుకున్నాడు. కానీ ఆ తర్వాత మళ్లీ వర్షం కురవటం మొదలైంది. షెడ్యూల్‌ ‌సమయం వరకు ఎదురుచూసిన అంపైర్లు..మ్యాచ్‌‌ను అధికారికంగా రద్దు చేశారు. ఐదు మ్యాచ్‌‌ల వన్డే సిరీస్‌‌లో భారత్‌ 2-0తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. మూడో వన్డే వర్షార్పణంతో న్యూజిలాండ్‌ ‌సిరీస్‌‌ను సమం చేయగలదే కానీ సొంతం చేసుకోలేదు. దీంతో 2019 నుంచి వరుసగా వన్డే సిరీస్‌‌లు సాధించిన రికార్డుకు ఈ సిరీస్‌‌తో తెరపడింది. భారత్‌, న్యూజిలాండ్‌ ‌నాల్గో వన్డే శుక్రవారం మౌంట్‌ ‌మాంగానుయ్‌‌లో జరుగనుంది. కెప్టెన్‌ ‌శుభ్‌‌మన్‌ ‌గిల్‌ ‌టెస్టు సిరీస్‌‌కు సన్నద్ధం అయ్యేందుకు జట్టును వీడనుండగా.. శ్రేయస్‌ అయ్యర్‌ ‌నాయకత్వ బాధ్యతలు చేపట్టనున్నాడు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్