Magazines

రూ.7 లాటరీ టికెట్‌..కోటీశ్వరురాలైన పేద మహిళ

23 అక్టోబర్, 2026

Lottory
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 23, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : పంజాబ్‌లోని కోట్‌కపురాకు చెందిన నిరుపేద దినసరి కూలీ భార్య బిమ్లా దేవి అదృష్టం వరించింది. పిల్లల కోసం బట్టలు కొనడానికి వెళ్లిన ఆమె, రైల్వే రోడ్డులోని స్టార్ లాటరీ స్టాల్‌లో కేవలం రూ. 7 పెట్టి సిక్కిం ప్రభుత్వ లాటరీ టికెట్ కొనుగోలు చేశారు. ఫలితాల్లో ఆమెకు ఏకంగా కోటి రూపాయల జాక్‌పాట్ తగిలింది. స్టాల్ నిర్వాహకులు ఈ విషయాన్ని ఫోన్ ద్వారా తెలపడంతో బిమ్లా దేవి కుటుంబంలో ఆనందాలు వెల్లివిరిశాయి. కూలీ పనులతో ఆర్థిక ఇబ్బందులు పడ్డ తాము, ఇప్పుడు ఈ డబ్బుతో పిల్లల భవిష్యత్తు కోసం చిన్న వ్యాపారం ప్రారంభిస్తామని ఆమె తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్