నవతెలంగాణ-హైదరాబాద్: కావేరి జలాల( kavery )వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కర్ణాటక(Karnataka) ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తమిళనాడును ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. తమ వద్ద నీళ్లు ఉంటే కచ్చితంగా తమిళనాడుకు ఇచ్చేవారమన్నారు. కానీ ప్రస్తుతం తమ రాష్ట్రంలోనే తాగడానికి కూడా సరిపడా నీళ్లు లేవని ఆయన స్పష్టం చేశారు. మా రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. రిజర్వాయర్లలో నీటి నిల్వలు దారుణంగా పడిపోయాయని, ఈ ఏడాది కావేరి నదికి సంప్రదాయంగా సమర్పించే ‘బాగిన’ (పూజ) కూడా తాను చేయలేకపోయానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే కావేరి, మేకెదాటు ప్రాజెక్టుపై తమిళనాడు కాంగ్రెస్ నాయకుల ఆరోపణలపై కాంగ్రెస్ హైకమాండ్‌తో మాట్లాడుతానని పేర్కొన్నారు.
కర్ణాటక నుంచి 11 టీఎంసీల కావేరి జలాలను విడుదల చేసేలా కర్ణాటకను ఆదేశించాలంటూ తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన రెండు పిటిషన్లను జస్టిస్ విక్రమ్ నాథ్, అపరేష్ కుమార్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం పిటిషన్లను కొట్టివేసిన విషయం తెలిసిందే.







కామెంట్లు (0)