Magazines

ఢిల్లీ మీడియా సమావేశంలో అభిజీత్ దిప్కే కీలక వ్యాఖ్యలు

15 అక్టోబర్, 2026

deepkae
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 15, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: ఢిల్లీ మీడియా సమావేశంలో 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) కార్యకర్త అభిజీత్ దిప్కే కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం ఒక్క వ్యక్తి, జ్ఞానేశ్ కుమార్ కోసం కేంద్రం అనేక ఆంక్షలు విధిస్తోందని ఆరోపించారు. గత 10-15 రోజులుగా ఢిల్లీలో విద్యార్థులు, యువత వీధుల్లో నిరసనలు తెలుపుతుంటే, వారిని ఈడ్చుకెళ్తున్నారని, వారితో చేరిన ప్రతిపక్ష నాయకులను కూడా బలగాలు అదుపులోకి తీసుకున్నారని ఆయన ఆరోపించారు. ఇదంతా జ్ఞానేశ్ కుమార్ కోసమేనని మండిపడ్డారు.


జర్నలిస్టులను నిర్బంధించడం, వేధింపులకు పాల్పడటంపై ఏఐఎస్ఏ కార్యకర్త నేహా బోరా గురువారం అధికారులను తీవ్రంగా విమర్శించారు. విలేకరుల సమావేశంలో బోరా మాట్లాడుతూ..ప్రెస్ కార్డులు ఉన్నాయని తెలిసి కూడా, జర్నలిస్టులను కొట్టి, ఈడ్చి గంటల తరబడి నిర్బంధించారని తెలియజేశారు. జర్నలిస్టుల నుండి కెమెరాలను ఎలా లాక్కున్నారో చూశాం. యువత ఆందోళనలను కవర్ చేస్తున్న జర్నలిస్టుల పట్ల ఢీల్లీ పోలీసులు దారుణంగా వ్యవహరించారని ఆమె మండిపడ్డారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్