Magazines

416 గ్రామాల్లో భూ సర్వే పూర్తి: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

8 గంటల క్రితం

Land survey completed in 416 villages: Minister Ponguleti Srinivasa Reddy
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 10, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: ఇప్పటి వరకు 416 గ్రామాల్లో సర్వే ప్రక్రియ పూర్తయిందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. భూ యజమానుల ప్రయోజనాలకే సర్వేలో అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. రెవెన్యూ రికార్డుల ఆధారంగానే భూ సర్వే ప్రారంభించాలని పేర్కొన్నారు. సర్వే పూర్తయ్యాక భూ యజమానులకు తప్పనిసరిగా నోటీసులు ఇవ్వాలని తెలిపారు.

మంగళవారం తెలంగాణ సచివాలయంలో భూ రీసర్వే పురోగతిపై జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి భూ యజమానికి స్పష్టమైన హక్కులు, కచ్చితమైన హద్దులే లక్ష్యమని పేర్కొన్నారు. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో భూదార్ నంబర్ల కేటాయింపు వేగవంతం చేయాలని ఆదేశించారు. తరతరాలుగా పరిష్కారం కాని భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని సూచించారు.భూ రీసర్వే వల్ల చిన్న పొరపాటు కూడా భవిష్యత్తులో భూ వివాదానికి కారణం కాకూడదని అధికారులకు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి రెడ్డి స్పష్టం చేశారు.అధికారులంతా పారదర్శకత, కచ్చితత్వంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్లను మంత్రి పొంగులేటి కోరారు. తెలంగాణలో ప్రస్తుతం సమగ్ర భూ రీసర్వే వెయ్యి గ్రామాలు దాటిందని గుర్తు చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్