నవతెలంగాణ – అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఆయన భార్య అన్నా లెజ్‌నెవా తమ వైవాహిక బంధాన్ని ముగించాలని నిర్ణయించుకున్నారు. 13 ఏళ్ల వివాహ బంధానికి పరస్పర అవగాహన, గౌరవంతో ముగింపు పలుకుతున్నట్లు సోమవారం రాత్రి ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు.
తాము మంచి స్నేహితులుగా కొనసాగుతామని, పిల్లల బాధ్యతను కలిసే నిర్వర్తిస్తామని ప్రకటనలో పేర్కొన్నారు. పిల్లల సంతోషం, శ్రేయస్సే తమకు ప్రాధాన్యమని, ఈ సమయంలో వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని కోరారు. పవన్ కల్యాణ్, అన్నా లెజ్‌నెవా 2013 సెప్టెంబర్ 30న వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, విడాకుల ప్రక్రియకు సంబంధించి అధికారికంగా వెల్లడైన వివరాలు ఇంకా స్పష్టంగా లేవు.






కామెంట్‌లు (0)