Magazines

హోటల్‌లో కాల్పులు.. ఆరుగురు మృతి

3 గంటల క్రితం

guwahati
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 27, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌ : అస్సాం రాజధాని గౌహతిలోని లాచిత్‌ నగర్‌లో తీవ్ర కలకలం చోటుచేసుకుంది. అక్కడి ‘హోటల్‌ బిలాస్‌ ఇన్‌’లో సోమవారం రాత్రి జరిగిన కాల్పుల ఘటనలో హోటల్‌ యజమాని హెలీనా భరాలి, ఆమె కుమారుడితో సహా ఆరుగురు మృతి చెందినట్లు గౌహతి పోలీసు కమిషనర్‌ ధృవీకరించారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఆస్తి వివాదమే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది. కాల్పుల్లో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనకు పాల్పడిన నిందితుడి వివరాలు ఇంకా తెలియరాలేదు. నిందితుడి ఆచూకీ కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్