Magazines

ఫ్లిప్‌కార్ట్ రీఫండ్ పేరుతో మహిళకు రూ.లక్ష టోకరా

2 గంటల క్రితం

Woman gets Rs 1 lakh in the name of Flipkart refund
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 27, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్: ఆన్‌లైన్‌ షాపింగ్‌లో రీఫండ్‌ కోసం ప్రయత్నించిన ఓ మహిళ సైబర్‌ నేరగాళ్ల చేతిలో మోసపోయింది. ఉత్తరప్రదేశ్‌లోని ఇటావాకు చెందిన ఆకాంక్ష అనే మహిళ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.674 విలువైన చీరను కొనుగోలు చేసింది. ఆ చీరకు సంబంధించిన రీఫండ్‌ కోసం ప్రయత్నించగా, సైబర్‌ నేరగాళ్లు ఆమెను లక్ష్యంగా చేసుకున్నారు. రీఫండ్‌ ఇప్పిస్తామని నమ్మించిన మోసగాళ్లు ఆమెతో మొబైల్‌ స్క్రీన్‌ షేర్‌ చేయించారు. అనంతరం గిఫ్ట్‌ కార్డు ద్వారా ఆమె ఖాతా నుంచి ఐదు విడతల్లో మొత్తం రూ.99,518 కాజేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య ఈ మోసం జరిగినట్లు సమాచారం. వివాహం కోసం దాచుకున్న డబ్బు పోవడంతో బాధితురాలు తీవ్ర ఆవేదనకు గురైంది. వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆన్‌లైన్‌ రీఫండ్‌ల పేరుతో అపరిచితులు పంపే లింకులను తెరవడం, ఫోన్‌ స్క్రీన్‌ను షేర్‌ చేయడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని సైబర్‌ భద్రతా నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్