Magazines

సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి సింగరేణి నిధులు

7 గంటల క్రితం

mla ragamai
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 12, 2026 | 2 నిమిషాల చదవడం

- సింగరేణి కార్మికులకు దసరా బోనస్ కానుక

- ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్‌ 

నవతెలంగాణ-సత్తుపల్లి

సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి సింగరేణి నిధులతో వివిధ రకాల వైద్య పరికరాలు త్వరలో ఏర్పాటు అవుతున్నాయని, అలాగే  సింగరేణి కార్మికులకు దసరా బోనస్ అందం ఉందని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్‌ తెలిపారు. ఎమ్మెల్యే  రాగమయి దయానంద్‌ ద్వారకాపురి లోని అధికారిక క్యాంప్ కార్యాలయంలో సోమవారం సాయంత్రం  విలేకరులతో మాట్లాడారు. గతంలో కేవలం సింగరేణి అధికారులకు మాత్రమే బోనస్ లు ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఈ సందర్భంగా గుర్తు చేశారు. ​కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కార్మికులకు సైతం న్యాయం చేస్తూ బోనస్ ఇస్తున్నామని ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేశారు.


దసరా పండుగ లోపు సింగరేణి అధికారులు, కార్మికుల సమస్యలన్నింటినీ పరిష్కరించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులకు స్పష్టమైన  ఆదేశాలు ఇచ్చారని ఎమ్మెల్యే చెప్పారు. ​సింగరేణి బ్లాక్ -3 సమస్యకు వీలైనంత త్వరగా శాశ్వత పరిష్కారం చూపాలని, దానిని సింగరేణి సంస్థకే అప్పగించేలా కృషి చేయాలని డిప్యూటీ సీఎంను కోరినట్లు ఎమ్మెల్యే వివరించారు. ​సత్తుపల్లి మండలం కిష్టారం అంబేద్కర్ నగర్ కాలనీలోని సింగరేణి బాధితుల కోసం ప్రత్యేకంగా భూమిని సేకరించి పునరావాస ప్యాకేజీ అందించేందుకు డిప్యూటీ సీఎం సానుకూలంగా స్పందించారని, దీనిపై మొదటి అడుగు పడిందని ఎమ్మెల్యే అన్నారు.


సింగరేణి నిర్వాసితులకు, బాధితులకు ఎలాంటి అన్యాయం జరగకుండా వీలైనంత త్వరగా న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారని ఎమ్మెల్యే రాగమయి దయానంద్‌ అన్నారు. ​సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి అత్యంత ఆధునిక వైద్య పరికరాలు సమకూర్చి, సూపర్ మల్టీ స్పెషాలిటీ స్థాయిలో వైద్య సేవలు అందించేలా సింగరేణి సంస్థ నిధులు కేటాయించేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య రక్షణకు, సింగరేణి కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని ఎమ్మెల్యే డాక్టర్ రాగమయి దయానంద్ పునరుద్ఘాటించారు. ఈ సమావేశంలో ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు, చల్లగుళ్ల నరసింహారావు, ఐ కౌన్సిలర్లు మట్టా ప్రసాద్ ఉప్పు నాగమణి జగన్నాథం శ్రీను, ఐఎన్టీయూసీ నాయకులు కోటేష్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్