Magazines

సత్తుపల్లి బాలుడికి అండగా యువ భారత్ శక్తి  ఫౌండేషన్

7 గంటల క్రితం

Shakti Foundation
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 12, 2026 | 1 నిమిషాల చదవడం

- రూ. 50 వేల ఆర్థిక సహాయం అందజేత

నవతెలంగాణ-సత్తుపల్లి

 సత్తుపల్లి పట్టణంలోని ద్వారకాపురి కాలనీకి చెందిన 12 ఏళ్ల బాలుడు కొరకొప్పు చార్లెస్ ఫిన్నీ అరుదైన బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతూ ప్రాణాలతో పోరాడుతున్నాడు. బాలుడి తండ్రి జానకి రాముడు వృత్తిరీత్యా పెయింటర్ కాగా, ప్రస్తుతం బాబు తమిళనాడులోని వెల్లూరు సీఎంసీ  ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ​చార్లెస్ వైద్యం నిమిత్తం కుటుంబసభ్యులు పడుతున్న కష్టాన్ని గుర్తించి, సోషల్ మీడియా వేదికగా విరాళాలను యువభారత్ శక్తి ఫౌండేషన్ సేకరించింది.


దాతల సహకారంతో సోషల్ మీడియా ద్వారా సేకరించిన రూ. 50వేలను ఫౌండేషన్ సభ్యులు సోమవారం బాలుడి ఇంటికి వెళ్లి చార్లెస్ నానమ్మకు అందజేశారు. ​ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తమకు ఈ సాయం ఎంతో ఊరటనిస్తుందని కుటుంబసభ్యులు తెలిపారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలుడిని ఆదుకునేందుకు ముందుకు వచ్చిన ప్రతి ఒక్క దాతకు ఫౌండేషన్ బాధ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ముఖ్య సభ్యులు, స్థానికులు, చార్లెస్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ​బాలుడు త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి తిరిగి రావాలని ఫౌండేషన్ బాధ్యులు ఆకాంక్షించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్