Magazines

సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై

23 సెప్టెంబర్, 2026

police
avatar
Shiva Kumar

ప్రచురించబడింది సెప్టెం 23, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-నవాబుపేట
నవాబుపేట పోలీస్ స్టేషన్‌లో బుధవారం సైబర్ నేరాలపై ఎస్సై నరేందర్‌ అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ సురక్షా తిరంగా అనే నినాదంతో సైబర్ మోసాల పట్ల ఎలా అప్రమత్తంగా ఉండాలో ఆన్లైన్ మోసాలు ఎలా గుర్తించాలో వాటిబారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచనలు సలహాలు పాటించాలని సూచించారు. ప్రధానంగా పెట్టుబడి, డిజిటల్ అరెస్టు, లోన్ ఆప్, ఉద్యోగాల పేరుతో జరిగే మోసాలు ప్రకటనలు సోషల్ మీడియాలో జరిగే మోసాలు ఓటీపీ బ్యాంకు వివరాలు వ్యక్తి గత సమాచారం ఎవరితో పంచుకోకూడదన్నారు.


సైబర్ మోసాలకు గురైన 1930టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాలు, భద్రతపై వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని, ట్రిపుల్ రైడింగ్ చేయరాదని తెలిపారు. సురక్షా తిరంగా అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నవాబుపేట పోలీస్ స్టేషన్ సిబ్బంది వాహనదారులు, యువకులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్