Magazines

వ్యవసాయ విద్యలో ఉన్నత విద్యా అవకాశాలు

8 గంటల క్రితం

agricultural education
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 03, 2026 | 1 నిమిషాల చదవడం

- వ్యవసాయ విశ్వవిద్యాలయం విద్యార్థులు

నవతెలంగాణ - తొగుట

వ్యవసాయ విద్యలో ఉన్నత విద్యా అవకాశాలు ఉన్నాయని వ్యవసాయ విశ్వవిద్యాలయం విద్యా ర్థులు తెలిపారు. శనివారం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో మండలంలోని గుడికందుల గ్రామం లో ఐదో రోజు ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేక శిబిరంలో నిర్వహించారు. 9, 10వ తరగతి విద్యా ర్థులకు వ్యవసాయ విద్యలో ఉన్నత విద్యా అవ కాశాలు, వ్యవసాయ రంగంలో కెరీర్ అవకాశాలపై అవగాహన కల్పించారు. వ్యవసాయ విద్యలో అందుబాటులో ఉన్న వివిధ కోర్సులు, ఉద్యోగ, స్వయం ఉపాధి అకాశాలను వివరించారు.


అనంతరం వాలంటీర్లు సిద్దిపేటలోని లార్డ్ ఓల్డ్ ఏజ్ హోమ్‌ను సందర్శించి వృద్ధులతో ఆత్మీయంగా మాట్లాడి వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు. వారికి పండ్లు, అవసరమైన ఇతర వస్తువులను అందజేశారు. ఈ సందర్భంగా వాలంటీర్లు మాన వతా విలువలు, సేవాభావం, సామాజిక బాధ్యతను చాటుకున్నారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు డా. కల్పన, డా. సాయి ప్రసాద్, డా. కార్తీక్ పాల్గొని వాలంటీర్లకు, విద్యార్థులకు మార్గదర్శనం చేశారు. శిబిరం ద్వారా విద్యార్థుల్లో సామాజిక బాధ్యత, నాయకత్వ లక్షణాలు, సేవాభావాన్ని పెంపొందిం చడంతో పాటు సమాజానికి ఉపయోగపడే పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకు లు తెలిపారు. ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు స్వంతంగా కొంత మొత్తాన్ని సమకూర్చుకుని, స్వచ్ఛందంగా గుడికందుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెను కభాగంలోని ప్రహరీ గోడకు రంగులు వేశారు. పాఠ శాల పరిసరాలను పరిశుభ్రంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు కార్యక్రమం చేపట్టారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్