Magazines

జానపద సాంస్కృతి జాతర విజయవంతం చేయాలి 

8 గంటల క్రితం

folk culture
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 03, 2026 | 1 నిమిషాల చదవడం

-  సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు వలస సుభాష్

నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్ 

 ఈ నెల 9న కరీంనగర్ లోని ఫిలిం భవన్ లో జరిగే  తెలంగాణ రాష్ట్ర స్థాయి జానపద సాంస్కృతి జాతర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు వలస సుభాష్ అన్నారు. శనివారం హుస్నాబాద్ పట్టణంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ  జానపదాన్ని భావితారాలకు అందించేందుకు మా సంకల్ప సంస్థ కలల పట్ల సంస్కృతి పట్ల కృషి చేస్తుందన్నారు.


జానపద కళాకారులు మహిళా కోలాటం బృందాలు యక్షగానం బతకమ్మ ఆటపాట తెలంగాణ సంస్కృతి ప్రతిబింబే విధంగా జానపద కళాకారులచే కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమానికి జానపద కళాకారులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమానికి వచ్చే కళాకారులు సమాచారం కోసం  9440988001 సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు.   జానపద కళలను సంరక్షించి భావితరాలకు అందించడమే మా సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ఆశయం అని వలస సుభాష్ తెలిపారు ఈకార్యక్రమంలో సంకల్ప సంస్థ కోఆర్డినేటర్ సంఘ శ్రీధర్ ,తెలంగాణ ధూంధాం కళాకారుడు తాడూరి సురేష్ , చల్ల గోoడ స్వామి రావు, వెలిశెట్టి రంగయ్య, పత్తిపాక త్రిమూర్తి  తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్