Magazines

రైతులు ఫార్మర్‌ ఐడీ నమోదు చేసుకోవాలి: పటేల్‌ వంశీ రెడ్డి

8 గంటల క్రితం

Former ID
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 03, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-ఆలేరు రూరల్ 

వ్యవసాయ శాఖకు సంబంధించిన ప్రభుత్వ పథకాలు, రైతు సేవలను సులభంగా పొందేందుకు రైతులు ఫార్మర్‌ ఐడీ నమోదు చేసుకోవాలని సీఎస్‌సీ ఆలేరు మండల నిర్వాహకులు పటేల్‌ వంశీ రెడ్డి సూచించారు. శనివారం మంతపురి గ్రామంలో నవతెలంగాణ విలేకరితో మాట్లాడుతూ.. రైతులు ఆధార్‌ వివరాలతో తమకు ఇప్పటికే ఫార్మర్‌ ఐడీ ఉందో లేదో తెలుసుకోవాలని, లేని వారు అవసరమైన వివరాలతో నమోదు చేసుకోవాలని తెలిపారు.

ఫార్మర్‌ ఐడీ ద్వారా యూరియా బుకింగ్‌, పీఎం–కిసాన్‌ ఈ–కేవైసీ, పంటలకు సంబంధించిన ఆన్‌లైన్‌ సేవలు, వివిధ రైతు సంక్షేమ పథకాల దరఖాస్తులు వంటి సేవలను పొందవచ్చన్నారు.ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల వివరాలను తెలుసుకుని, అర్హత ఉన్న రైతులు నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.భూమి ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ ఫార్మర్‌ ఐడీ నమోదు చేసుకునే సదుపాయం ఉందని తెలిపారు. వివరాల కోసం 9295559772 నంబర్‌ను సంప్రదించాలని వంశీ రెడ్డి సూచించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్