Magazines

రాష్ట్రస్థాయి పరుగు పందెంలో సాయి కుమార్‌కు ద్వితీయ స్థానం

1 గంట క్రితం

Bhavitha school
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 14, 2026 | 1 నిమిషాల చదవడం

- జాతీయస్థాయి పోటీలకు ఎంపిక
- భవిత హైస్కూల్‌కు గర్వకారణం
నవతెలంగాణ - కామారెడ్డి
రాష్ట్రస్థాయి అండర్‌ - 10 విభాగం 60 మీటర్ల పరుగు పందెం పోటీల్లో భవిత హైస్కూల్ విద్యార్థి సాయి కుమార్ ద్వితీయ స్థానం సాధించి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఈ ఘనత సాధించడం పాఠశాలకు గర్వకారణమని పాఠశాల కరస్పాండెంట్ రాజశేఖర్ రావు, ప్రిన్సిపాల్ స్రవంతి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సాయి కుమార్ తన ప్రతిభ, పట్టుదలతో రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రదర్శన కనబరిచి రెండో స్థానాన్ని కైవసం చేసుకోవడం అభినందనీయమన్నారు.


విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని, క్రీడలు వారిలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, పట్టుదల వంటి సద్గుణాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావడం సాయి కుమార్ కృషికి నిదర్శనమని, అక్కడ కూడా అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పాఠశాలతోపాటు కామారెడ్డి ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. సాయి కుమార్ సాధించిన విజయం ఇతర విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని వారు పేర్కొంటూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని అభినందించారు. 

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్