Magazines

చాకలి ఐలమ్మ పోరాటం నేటి యువతకు ఆదర్శం కావాలి

26 సెప్టెంబర్, 2026

Ailamma
avatar
Shiva Kumar

ప్రచురించబడింది సెప్టెం 26, 2026 | 1 నిమిషాల చదవడం

ఘనంగా చాకలి ఐలమ్మ 131వ జయంతి

గ్రామ సర్పంచ్ మాదరి ప్రశాంత్

నవతెలంగాణ-నెల్లికుదురు

నెల్లికుదురు మండలం శ్రీరామగిరి గ్రామంలో చాకలి ఐలమ్మ యువజన సంఘం అధ్యక్షుడు పోరండ్ల సంపత్ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాదరి ప్రశాంత్ మాట్లాడుతూ, తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ కీలక పాత్ర పోషించారని అన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, తెలంగాణ విముక్తి కోసం ఐలమ్మ చేసిన పోరాటం నేటి యువతకు స్ఫూర్తిదా యకమని పేర్కొన్నారు.


అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె చూపిన ధైర్యం, పోరాట స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలని సర్పంచ్ పిలుపునిచ్చారు. ఐలమ్మ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ డాక్టర్ ఆదూరి కలదర్ రాజు,  నేతలు గొల్లపలి ప్రభాకర్ గౌడ్, బెల్లి నర్సయ్య, నల్లెడ యాకిరెడ్డి, మద్దెల రమేష్, డోనికని మల్లయ్య,నోముల రాజారాం,చాకలి ఐలమ్మ యువజన సంఘం సభ్యులు,పోరండ్ల సోమయ్య, పోరండ్ల లక్ష్మయ్య, వెంకన్న, గణేష్, సతీష్.మడిపేద్ది చంద్రయ్య, ఎల్లయ్య, ముకేశ్, ఉప్పలయ్య రవి తేజ,బిక్షం,గుట్టయ్య, వెంకన్న, చింటు యేస్సు, యువత తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్