Magazines

సీసీరోడ్డు నిర్మించిన ఏడాది తర్వాత తూము ఏర్పాటు

1 గంట క్రితం

cc road
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 27, 2026 | 2 నిమిషాల చదవడం

- ఏడాది క్రితం రూ.17.20 లక్షలతో చేపట్టిన నిర్మాణం

- పనుల వివరాలపై అధికారుల వివరణకు ఎదురుచూపులు

నవతెలంగాణ - అశ్వారావుపేట

సీసీ రోడ్డు నిర్మాణం పూర్తయిన ఏడాది తర్వాత అదే రహదారిపై తూము ఏర్పాటు పనులు చేపడుతున్నారు. సాధారణంగా రోడ్డు నిర్మాణ సమయంలోనే ప్రాంత భౌగోళిక పరిస్థితులు, వర్షపు నీటి ప్రవాహ మార్గాలను పరిగణనలోకి తీసుకుని అవసరమైన చోట తూములు, కల్వర్టులు ఏర్పాటు చేస్తారు. అయితే ఈ రహదారిపై నిర్మాణం పూర్తయిన ఏడాది తర్వాత తూము ఏర్పాటు పనులు చేపట్టడం గమనార్హం. పాతపేరాయిగూడెం నుంచి అశ్వారావుపేటలోని జంగారెడ్డిగూడెం రోడ్డులో రిలయన్స్ ఎస్‌.మార్ట్‌ సమీపానికి వెళ్లేందుకు ఈ మార్గం ఉపయోగపడుతోంది. దీంతో ఈ రహదారిపై వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. అయితే ప్రస్యతుతం ఒక చోట నీరు నిలిచి పోవడంతో రహదారికి తూము ఏర్పాటు చేస్తున్నారు.

- రూ.17.20 లక్షల వ్యయం

రోడ్ ప్రారంభం లో ఏర్పాటు చేసిన శిలాఫలకంపై ఉన్న వివరాల ప్రకారం, 2024 - 25 సంవత్సరంలో వీబీజీ రాంజీ పథకం కింద పేరాయిగూడెం గ్రామంలో నిర్మాణ పనులు చేపట్టారు. ఇందుకోసం రూ.17.20 లక్షల వ్యయాన్ని హెచ్చించారు.

సీసీ రోడ్డు నిర్మాణం పూర్తయిన తర్వాత తూము ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎందుకు ఏర్పడిందనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఏర్పాటు మొదట మంజూరైన పనుల్లో భాగమా, లేక తదనంతరం అవసరం ఏర్పడిందా అనే విషయాన్ని సంబంధిత నిర్మాణ రికార్డులు, సాంకేతిక వివరాల ఆధారంగా తెలుసుకోవాల్సి ఉంది.


రోడ్డు నిర్మాణం, నీటి పారుదల ఏర్పాట్లు సమన్వయంతో జరిగితే రహదారి వినియోగదారులకు ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో తూము ఏర్పాటు పనులకు సంబంధించిన వివరాలను అధికారులు వెల్లడిస్తే నిర్మాణ ప్రక్రియపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

రోడ్డుకే నిధులు ఇచ్చాం - వీబీజీ రామ్ జీ ఏపీఓ రామచంద్ర రావు: తీర్మానం ప్రకారం రోడ్డు కోసమే నిధులు మంజూరు చేసాం.నీటి పారుదల కోసం తూము ఎందుకు ఏర్పాటు చేయలేదో పంచాయితీ రాజ్ ఇంజినీర్ లకే తెలుస్తుంది. పంచాయతీ రాజ్ అధికారులను ఫోన్ లో సంప్రదించడానికి ప్రయత్నం చేయగా అందుబాటులో లేరు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్