Magazines

బంజారాహిల్స్ పీఎస్‌లో ఏసీబీ సోదాలు: రూ.లక్ష లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎస్సై

1 గంట క్రితం

Banjara Hills PS
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 28, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ హైదరాబాద్:

హైదరాబాద్‌ నగరంలోని ప్రముఖ బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు బుధవారం ఆకస్మిక సోదాలు చేపట్టారు. ఒక కేసు విషయంలో బాధితుడి నుంచి రూ.లక్ష లంచం తీసుకుంటుండగా బంజారాహిల్స్‌ ఎస్సై విజయ్‌ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

కేసుకు సంబంధించిన వ్యవహారంలో ఎస్సై విజయ్ బాధితుడి నుంచి మొత్తంగా రూ.10 లక్షలు లంచంగా డిమాండ్ చేసినట్లు సమాచారం. అందులో భాగంగా మొదటి విడతగా రూ.లక్ష తీసుకుంటుండగా ముందస్తు సమాచారంతో దాడులు చేసిన ఏసీబీ బృందం ఆయనను అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం ఎస్సై విజయ్‌ను ఆధీనంలోకి తీసుకున్న అధికారులు కేసు నమోదు చేసి సుదీర్ఘంగా విచారిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్