బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

25 నిమిషాల క్రితం

suicide
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 27, 2026 | 1 నిమిషాల చదవడం

- బ్యాక్‌లాగ్‌ సబ్జెక్టులే కారణమా?

నవతెలంగాణ - అశ్వారావుపేట

మండలంలోని అచ్యుతాపురం గ్రామానికి చెందిన బొల్లేపల్లి జస్వంత్ వర్మ (23) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.


అదనపు ఎస్సై జె. దేవ్‌సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారంలోని సాయిస్ఫూర్తి కళాశాలలో జస్వంత్ వర్మ బీటెక్ పూర్తి చేశాడు. అయితే కొన్ని సబ్జెక్టుల్లో బ్యాక్‌లాగ్స్ మిగిలి ఉండటంతో మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. శుక్రవారం ఉదయం నిద్రలేచిన తల్లి గమనించగా, ఇంటి వద్ద ఉన్న రేకుల షెడ్డులో విగతజీవిగా కనిపించాడు.


మృతుడి తండ్రి బొల్లేపల్లి విజయ సత్యరామరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై జె. దేవ్‌సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అదనపు ఎస్సై తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్