నవతెలంగాణ-నెల్లికుదురు
మండల కేంద్రానికి చెందిన అల్వాల మల్లేష్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న చిన్ననాటి స్నేహితులు శుక్రవారం మల్లేష్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చారు. ఈ సందర్భంగా స్నేహితులు మాట్లాడుతూ..మల్లేష్ మృతి బాధాకరమన్నారు. అధైర్య పడొద్దనీ, తమకు తోచిన విధంగా అండగా ఉంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిన్ననాటి మిత్రులు పోతుగంటి శ్రీనివాస్, గుండెబోయిన అశోక్, బందారపు వేణు, సలుగు శ్రీను, గుండ్ల రాము, డీలర్ శ్రీను, మస్కపురి సుధాకర్, పులి శ్రీనివాస్ ,పులి జంపయ్య, పులి రమేష్,, రత్నపురపు యాకయ్య, వేణు, రాము తదితరులు పాల్గొన్నారు.





కామెంట్లు (0)