- ఐదుగురికి రూ.2 వేల చొప్పున జరిమానా
- ఇద్దరికి మూడు రోజుల జైలు శిక్ష
నవతెలంగాణ - అశ్వారావుపేట
మద్యం మత్తులో వాహనాలు నడిపిన ఏడుగురికి న్యాయస్థానం శిక్షలు విధించినట్లు అశ్వారావుపేట పోలీసులు తెలిపారు.
శుక్రవారం దమ్మపేట జేఎఫ్‌సీఎం కోర్టులో అశ్వారావుపేట మండలానికి చెందిన ఏడుగురు వ్యక్తులపై నమోదైన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల విచారణ జరిగింది. ఇందులో ఐదుగురికి ఒక్కొక్కరికి రూ.2 వేల చొప్పున జరిమానా, మరో ఇద్దరికి మూడు రోజుల జైలు శిక్ష విధించినట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా అశ్వారావుపేట మండల ప్రజలకు పోలీసులు సూచిస్తూ.. ఎవరూ మద్యం సేవించి వాహనాలు నడపవద్దని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించి పట్టుబడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.





కామెంట్‌లు (0)