Magazines

టీపీసీసీ చీఫ్‌తో డా. మట్టా దయానంద్ భేటీ

14 నిమిషాల క్రితం

TPCC chief
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 25, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-సత్తుపల్లి 

​తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌ను రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ నార్సింగిలోని ఆయన నివాసంలో కలిసి సత్తుపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ స్థితిగతులను వివరించారు. 


​నియోజకవర్గంలో ప్రస్తుతం నిర్వహిస్తున్న పార్టీ కార్యక్రమాలు, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై మహేష్ కుమార్ గౌడ్ దయానంద్ విజయకుమార్ తో చర్చించారు. రానున్న రోజుల్లో చేపట్టాల్సిన రాజకీయ, సంస్థాగత కార్యక్రమాల రూపకల్పనపై పలు అంశాలను ప్రస్తావించారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇమ్మనేని ప్రసాదరావు, దొడ్డా శ్రీనివాసరావు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్