Magazines

రేపు గంగారంలో ‘ఇందిరమ్మ బీమా’ నమోదు 

14 నిమిషాల క్రితం

Indiramma Bima
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 25, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-సత్తుపల్లి 

​గంగారం గ్రామపంచాయతీ కార్యాలయంలో నేడు (గురువారం) ఉదయం 9 గంటల నుంచి ఇందిరమ్మ బీమా పథకం ఆన్‌లైన్ నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సర్పంచ్ కాకర్ల రేవతి శేషగిరి, దాసరి మధుమోహనరెడ్డి యువసేన బాధ్యులు తెలిపారు. ఆన్‌లైన్ కోసం అభ్యర్థులు తమ రేషన్ కార్డు, బీమా చేయించుకునే అభ్యర్థి ఆధార్ కార్డు, నామినీ ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలతో స్వయంగా పంచాయతీ ఆఫీస్‌కు రావాలని సూచించారు.


ప్రతి కుటుంబానికి ఆసరాగా నిలిచే ఈ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీలకు అతీతంగా ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. గ్రామ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ కమిటీ సభ్యులు, మధుమోహనరెడ్డి యువసేన సభ్యులు బీమా ఆన్లైన్ నమోదు కార్యక్రమాన్ని దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తారని వారు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్