Magazines

'కన్ను' మూసినా.. ఇద్దరి 'కళ్లలో' వెలుగులు

12 నిమిషాల క్రితం

eye
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 25, 2026 | 1 నిమిషాల చదవడం

- సత్తుపల్లిలో కంభంపాటి కమల నేత్రదానన

- నేత్రాలను సేకరించిన సత్తుపల్లి లయన్స్ క్లబ్ సభ్యులు

- ​కుటుంబ సభ్యుల నిర్ణయంపై సర్వత్రా అభినందనల వెల్లువ

నవతెలంగాణ-సత్తుపల్లి 

​తాను మరణించినా మరొకరి జీవితంలో వెలుగులు నింపాలనే గొప్ప సంకల్పంతో సత్తుపల్లి పట్టణానికి చెందిన కంభంపాటి కమల నేత్రదానం చేశారు. పట్టణానికి చెందిన కంభంపాటి శ్రీనివాసరావు తల్లి కమల మంగళవారం సాయంత్రం మృతి చెందారు. ఈ విషాద సమయంలోనూ ఆమె కుటుంబ సభ్యులు సామాజిక స్పృహతో నేత్రదానానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు.


సమాచారం అందుకున్న సత్తుపల్లి లయన్స్ క్లబ్ బాధ్యులు అదే రోజు రాత్రి మృతురాలి గృహానికి చేరుకుని శాస్త్రీయ పద్ధతిలో కార్నియాలను సేకరించారు. ఈ నేత్రదానం ద్వారా అంధత్వంతో బాధపడుతున్న ఇద్దరికి కొత్త చూపు లభించే అవకాశం కలిగింది. మరణానంతరం కూడా ఇతరులకు ఉపయోగపడేలా కమల కుటుంబ సభ్యులు తీసుకున్న ఈ ఆదర్శవంతమైన నిర్ణయాన్ని పలువురు ప్రముఖులు, స్థానికులు అభినందించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్