Magazines

లహరి ప్రియ లివర్ మార్పిడి కోసం టాలెంట్ స్కూల్ ఆర్థిక సాయం 

14 నిమిషాల క్రితం

financial assistance
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 25, 2026 | 1 నిమిషాల చదవడం

- ఆపదలో ఉన్న పాపకు అండగా నిలిచిన పాఠశాల 

- ​విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించేందుకే సాయం కరస్పాండెంట్ శ్రీనివాసరావు

నవతెలంగాణ-సత్తుపల్లి 

తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తోట లహరి ప్రియ అనే పాప లివర్ మార్పిడి చికిత్స నిమిత్తం స్థానిక టాలెంట్ స్కూల్ తరఫున రూ.25 వేల ఆర్థిక సహాయాన్ని బుధవారం లహరి కుటుంబ సభ్యులకు అందజేశారు. పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు,  విద్యార్థులు మానవతా దృక్పథంతో విరాళాలుగా సేకరించిన ఈ మొత్తాన్ని లహరి కుటుంబ సభ్యులకు అందించి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు.


ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ పులి శ్రీనివాసరావు మాట్లాడుతూ... పాప త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ఇంటికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం మానవత్వానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. విద్యార్థుల్లో సేవాభావం, సానుభూతి, సామాజిక బాధ్యతను పెంపొందించే ఉద్దేశంతో ఈ ఆర్థిక సహాయం అందించినట్లు ఆయన తెలిపారు. లహరి ప్రియ త్వరగా కోలుకుని మళ్లీ ఆనందంగా తన జీవితాన్ని కొనసాగించాలని పాఠశాల బృందం మనస్ఫూర్తిగా కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్