- కుభీర్ లో ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన ఎమ్మెల్యే పటేల్
నవతెలంగాణ-కుభీర్ : ముధోల్ నియోజకవర్గంలో ఉన్న అర్హులందరికీ ప్రభుత్వం ఇండ్ల మంజూరు చేయాలని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ అన్నారు బుధవారం కుభీర్ మండల కేంద్రంలో కందూర్ పోతన్న అనే ఇందిరమ్మ లబ్ధిదారుని ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమానికి ముఖ్య అతితిగా హాజరై ప్రారంభించారు.సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పది సంవత్సరాల పాలకుల పాలన లో ముధోల్ నియోజకవర్గానికి ఎలాంటి అభివృద్ది పనులు మరియు ఇండ్లు మంజూరు కాకపోవడం తో పేద ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అదే విదంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ముధోల్ నియోజకవర్గానికి 3500 ఇండ్లు ఇస్తానని ప్రకటించి మాట తప్పిందని మండిపడ్డారు. నియోజకవర్గానికి కేవలం వెయ్యి ఇండ్లు ఇవ్వడం తో అర్హులకు న్యాయం చేయలేక పోతున్నామని అన్నారు.నియోజక వర్గ సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకు వెళ్లి మరిన్ని ఇండ్లు మంజూరు చేసేలా కృషి చేస్తానని అన్నారు. అంతకు ముందు చోండి గ్రామమలో పాలు సమస్యలను పరిశీలించి గ్రామమలో ఏ ఏ సమస్యలు ఉన్నాయో స్థానిక సర్పంచ్ క్రాంతి కిరణ్ ను అడిగి తెలుసుకొని గ్రామ సమస్యలపై చర్చించి గ్రామంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తానని అన్నారు. దింతో పాటు దార్ కుభీర్ గ్రామమలో హనుమాన్ ఆలయం లో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేసి అన్నదానా కార్యక్రమంలో పాల్గొన్నారు.కార్యక్రమం లో బిజెపి మండల అధ్యక్షులు ఏశాల దత్తాత్రి, పాటు సర్పంచ్ లు క్రాంతి రాజ్, మారుతీ,దవేందర్ వసంత్,నాయకులు గులాబ్, పండిత్ నర్సప్ప దత్తహరి పటేల్ తదితరులు పాల్గొన్నారు.






కామెంట్లు (0)