Magazines

ప్రతి కుటుంబానికి బీమా భరోసా

6 గంటల క్రితం

ప్రతి కుటుంబానికి బీమా భరోసా

Insurance

వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 20, 2026 | 1 నిమిషాల చదవడం

- ప్రతి కుటుంబానికి బీమా భరోసా

- అట్టహాసంగా ఇందిరమ్మ కుటుంబ బీమా ఆన్‌లైన్ నమోదు

- తెలంగాణకే ఈ పథకం తలమానికం

- మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు

నవతెలంగాణ - అశ్వారావుపేట

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పిస్తుందని మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలోని 1, 2, 3, 4, 15 వార్డుల్లో ఈ పథకం ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం కుటుంబాలకు భద్రత కల్పించే బృహత్తర కార్యక్రమమని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ టి.దిలీప్ రెడ్డి, ఆయా వార్డుల కౌన్సిలర్లు డేరంగుల ప్రసాద్, మౌనిక, చిన్నంసెట్టి శ్రీను, కట్టా సింధుజ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చిన్నంసెట్టి సత్యనారాయణ, నాయకులు తాడేపల్లి రవి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్