- సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్
- 63 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేత
నవతెలంగాణ-సత్తుపల్లి
పెళ్లిళ్లు అయినా పేదింటి ఆడపడుచులకు ప్రభుత్వం కల్యణ లక్ష్మి, షాది ముబారక్ పథకాల ద్వారా అందిస్తున్న సాయం ఆయా కుటుంబాలకు ఆర్థిక భరోసాను అందిస్తోందని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ స్పష్టం చేశారు.
మంగళవారం ఎమ్మెల్యే రాగమయి దయానంద్ తన క్యాంపు కార్యాలయంలో కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాల చెక్కులను పంపిణీ చేశారు.
సత్తుపల్లి పట్టణానికి చెందిన 27 మంది లబ్ధిదారులకు రూ.27,03,132 విలువైన చెక్కులను ఆమె అందించారు.
అలాగే సత్తుపల్లి మండలానికి చెందిన 36 మంది లబ్ధిదారులకు రూ.36,04,176 విలువైన చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మహిళల సంక్షేమం, ఆర్థిక భరోసా కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని తెలిపారు.
పేద కుటుంబాలకు అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ తాజా చైర్మన్ చల్లగుళ్ల నరసింహారావు, మున్సిపల్ చైర్ పర్సన్ మొహమ్మద్ రెహానా కమల్, మండల, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమిరెడ్డి సుబ్బారెడ్డి, గాదె చెన్నకేశవరావు, నాయకులు మొహమ్మద్ కమల్ పాషా, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






కామెంట్లు (0)