30 ఏళ్లు పనిచేస్తే రూ 25 వేల వేతనాలా. ?
ఓయూ నాన్ టీచింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారించాలి.
సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ.
నవతెలంగాణ - ఉస్మానియా యూనివర్సిటీ:- అడ్డ కులీలా కంటే, ఓయూ కాంట్రాక్టు,టైం స్కెల్, ఉద్యోగుల వేతనాలు ఉండటం హాస్యాస్పదంగా ఉందని, 30 ఏళ్ళు వారు వర్సిటీలో సేవాలు అందిస్తుంటే వారికి 20, మరియు 25 వేల వేతనాలు ఇవ్వడం ఏమిటీ అంటు సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. మంగళవారం ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేస్తున్న ఉద్యోగులు, పర్మినెంట్,కాంట్రాక్ట్, టైం స్కేల్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో అడ్మిస్ట్రేషన్ బిల్డింగ్ ఎదుట నిర్వహిస్తున్న మహా ధర్నా లో ముఖ్య అతిథిగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పాల్గొని ప్రసంగించారు.ఓయూ లో ఎదుర్కొంటున్న ఉద్యోగుల సమస్యలను,న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం, యూనివర్సిటీ పాలకమండలి తక్షణమే పరిష్కరించాలని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ అభివృద్ధిలో ఉద్యోగులు, కార్మికుల శ్రమ ఎంతో కీలకమైనదని, దశాబ్దాలుగా యూనివర్సిటీలో సేవలందిస్తున్న పర్మినెంట్ , టైం స్కేల్ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులకు మాత్రం ఉద్యోగ భద్రత లేకపోవడం విచారకరమన్నారు. చాలీచాలని వేతనాలతో కుటుంబాలను పోషించుకుంటూ పనిచేస్తున్న కార్మికులకు భవిష్యత్తుపై భరోసా లేకుండా పోయిందన్నారు. మీ న్యాయమైన డిమాండ్స్ ను రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని ఉద్యోగులకు హామీ ఇచ్చారు.
వీరు ప్రధానంగా పరిష్కరించాల్సిన అంశాలు
OPS (పాత పెన్షన్ విధానం) అమలుకు చర్యలు తీసుకోవాలి.
CPS ఉద్యోగులకు పెన్షన్ భద్రత కల్పించేలా సమస్యలను పరిష్కరించాలి.
ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలి.
కాంట్రాక్ట్ కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రాట్యుటీ చట్టబద్ధ ప్రయోజనాలు కల్పించాలి.
ఉద్యోగులకు సకాలంలో వేతనాలు చెల్లించాలి.
అర్హులైన ఉద్యోగులకు పదోన్నతులు, ఉద్యోగ భద్రత కల్పించాలి.కార్మికులకు PF, ESI తదితర సామాజిక భద్రతా సౌకర్యాలు పూర్తిస్థాయిలో అమలు చేయాలి.
దీర్ఘకాలంగా పనిచేస్తున్న కార్మికుల సేవలను గుర్తించి వారి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి.
ఒకవైపు విద్యాసంస్థల అభివృద్ధి గురించి మాట్లాడుతున్న పాలకులు, మరోవైపు ఆ విద్యాసంస్థలను నడిపిస్తున్న కార్మికుల జీవితాల గురించి పట్టించుకోకపోవడం సరైంది కాదన్నారు. కార్మికుల శ్రమను వినియోగించుకుంటూ వారికి ఉద్యోగ భద్రత, పదవీ విరమణ ప్రయోజనాలు కల్పించకపోవడం వల్ల వారి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు.కార్మికులకు న్యాయం జరిగే వరకు వారి పక్షాన, పోరాటాలు చేస్తున్న వారికి ఎర్ర జెండా సీపీఎం అండగా ఉంటుందన్నారు. యూనివర్సిటీ యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తక్షణమే చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని జాన్ వెస్లీ డిమాండ్ చేశారు.
కార్మికుల హక్కులను కాపాడటం ప్రభుత్వ బాధ్యత. ఓయూ కార్మికులకు ఉద్యోగ భద్రత, గౌరవప్రదమైన వేతనాలు, పెన్షన్, కాంట్రాక్ట్, టైం స్కేల్ ఉద్యోగులకు రిటైర్మెంట్ ప్రయోజనాలు కల్పించాలి. డిమాండ్ చేశారు భవిషత్ లో మీరు చేసే ప్రతి పోరాటంలో ప్రత్యక్షంగా కలిసి నడుస్తామని అన్నారు.ఈ వీరు అనివార్యంగా ఉద్యమం చేస్తున్నట్లు వీరు తలుచుకుంటే ప్రభుత్వలు తారుమారు అవుతాయి అని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి జే వెంకటేష్ ఆల్ యూనివర్సిటీస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణ సిఐటియు నగర అధ్యక్షులు దశరథ్. నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ ఆర్ ఎల్ మూర్తి డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్,ఓయూ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ యూనియన్ ప్రెసిడెంట్ టి మహేందర్, ఎస్ఎఫ్ఐ ఓయూ ప్రెసిడెంట్ అజయ్ ,తో పాటుగా ఓయూ ఉద్యోగ సంఘాలు ప్రతినిధులు బోయ కుమార్, అబ్దుల్ ఖాదీర్ ఖాన్, అక్బర్ బైగ్, పవన్ కుమార్, తో పాటుగా ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఉద్యోగులు పాల్గొన్నారు.






కామెంట్లు (0)