Magazines

రిటైర్డ్‌ అధికారులకూ ఆంక్ష‍లు వర్తిస్తాయి : ఈసీఐ

3 గంటల క్రితం

వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 10, 2026 | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) కింద ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే ఆంక్షలు, ఇకపై రిటైర్డ్‌ అధికారులు, రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాల ఆధ్వర్యంలో పనిచేసే ఇతర వ్యక్తులకు కూడా వర్తించనున్నాయి. ఈ మేరకు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో వచ్చే ఏడాది ప్రారంభంలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు, ప్రధాన ఎన్నికల అధికారులకు ఈసీఐ లేఖ రాసింది. రిటైర్డ్‌ అయిన అధికారులు, ప్రభుత్వాల ఆధ్వర్యంలో పనిచేసే ఇతర వ్యక్తులు తటస్థంగా ఉండాలని ఆదేశించింది. ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనకూడదని, ఓట్ల కోసం ప్రచారం చేయకూడదని స్పష్టం చేసింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్