పశ్చిమ బెంగాల్ లో బరితెగించిన బీజేపీ మూకలు
మాజీ మంత్రి దేబ్లీనా హెంబ్రమ్పై అటాక్
కోల్ కతా : పశ్చిమ బెంగాల్ లో బీజేపీ మూకలు బరితెగిస్తున్నాయి. దీనికి నిదర్శనమే కాళీ పూజ ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సీపీఐ(ఎం) పుస్తకాల దుకాణాలపై వరుస దాడులు కొనసాగాయి. ఆదివారం రాత్రి నుంచి ఇప్పటివరకు నాలుగు విధ్వంస ఘటనలు నమోదయ్యాయి. తాజాగా సోమవారం బంకురా పట్టణంలో అత్యంత తీవ్రమైన ఘటన చోటు చేసుకుంది. బెంగాల్ మాజీ మంత్రి, సీనియర్ సీపీఐ(ఎం) నాయకురాలు దేబ్లీనా హెంబ్రమ్పై అక్కడ బీజేపీ మద్దతుదారులుగా భావిస్తున్న వారు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలు బంకురా, ఉత్తర 24 పరగణాల జిల్లాలోని హబ్రా, నైహతి, మధ్యమ్గ్రామ్లలో నమోదయ్యాయి. సోమవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో బంకురాలోని స్కూల్దంగా వద్ద ఉన్న జిల్లా సీపీఐ(ఎం) కార్యాలయం బయట ఉన్న ఎస్ఎఫ్ఐ పుస్తకాల దుకాణంపై బీజేపీ మద్దతుదారులుగా భావిస్తున్న ఐదుగురు వ్యక్తుల బృందం దౌర్జన్యానికి దిగింది. దుకాణాన్ని ధ్వంసం చేసి, కుర్చీలను విరగ్గొట్టి, పుస్తకాలను ధ్వంసం చేసింది.
అదే విధంగా ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు మౌసమ్ నంది, సుమన్ కర్మాకర్లపైనా దాడికి పాల్పడింది. మూకల విధ్వంసాన్ని అడ్డుకోవటానికి ప్రయత్నించిన ఎస్ఎఫ్ఐ బంకురా జిల్లా అధ్యక్షుడు అనిర్బన్ గోస్వామిపై కూడా అటాక్ చేసింది. ఈ విధ్వంసం గురించి సమాచారం అందుకున్న హెంబ్రమ్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కానీ దుండగులు ఆయనపై దాడి చేశారని ఆరోపణలు ఉన్నాయి.ఈ ఘటనలో ఆ వృద్ధ నాయకుడు నేలపై పడిపోయారు. పోలీసులకు సమాచారం అందించగా, వారు విధ్వంసం ముగిసిన తర్వాత అక్కడికి చేరుకున్నారని ఎస్ఎఫ్ఐ ఆరోపించింది. ‘‘ఈ దాడి అకారణంగా, ముందుగా ప్రణాళిక వేసుకుని జరిగింది’’ అని నంది అన్నారు. ‘‘మేము సాధారణంగా మా స్టాల్స్‌ను క్రిస్టియన్ కాలేజీ సమీపంలో ఏర్పాటు చేస్తాం, కానీ పోలీసులు మమ్మల్ని వేరే చోటికి వెళ్లమని కోరారు. మేము ఆ ఆదేశాన్ని పాటించినప్పటికీ, మా దుకాణంపై దాడి జరిగింది."
అని పేర్కొన్నారు. మరో ఘటనలో ప్రదర్శనలో ఉన్న పుస్తకాలు ‘నాస్తికత్వాన్ని’ ప్రోత్సహిస్తున్నాయని ఆరోపిస్తూ మోండల్ అనే వ్యక్తి అభ్యంతరం వ్యక్తం చేసి, ఆ స్టాల్‌ను తొలగించాలని నిర్వాహకులను కోరారు. ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు నిరాకరించడంతో ఐదుగురు వ్యక్తుల బృందం ఆ పుస్తకాల పేజీలు చించి, స్టాల్‌ను ధ్వంసం చేసి, కవి సుకాంత భట్టాచార్య చిత్రాలను తొక్కారని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయమై స్థానిక బీజేపీ ఎమ్మెల్యే దేబ్దాస్ మోండల్, మోండల్‌ను కాషాయ శిబిరంతో సంబంధం ఉన్న వ్యక్తిగా గుర్తించడానికి నిరాకరించారు. నైహతిలో దీపావళి రోజు సాయంత్రం కాలేజ్ రోడ్ క్రాసింగ్ వద్ద పూజా పండాల్ సమీపంలోని ఎస్ఎఫ్ఐ పుస్తకాల స్టాల్‌ను ధ్వంసం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనా స్థలంలో సీపీఐ(ఎం) మద్దతుదారులు, దుండగుల మధ్య ఘర్షణ జరిగింది. మధ్యమ్‌గ్రామ్‌లోని కులుపర మోర్ వద్ద ఉన్న మరో ఎస్ఎఫ్ఐ పుస్తకాల దుకాణంపై బీజేపీ మద్దతుదారులుగా అనుమానిస్తున్న వారు దాడి చేశారు. పుస్తకాలను రోడ్డుపైకి విసిరారు, కుర్చీలను పగలగొట్టారు . సీపీఐ(ఎం) కార్యకర్తలపై దాడి చేశారు.






కామెంట్లు (0)