Magazines

త్వరలో హైదరాబాద్‌‌లో డ్రైవర్‌ లేకుండానే పాడ్‌ ట్యాక్సీలు

6 గంటల క్రితం

PRTS
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 20, 2026 | 2 నిమిషాల చదవడం

నవతెలంగాణ హైదరాబాద్: హైదరాబాద్‌ మహానగరంలో మెట్రో రైలు రాకతో మూడు ప్రధాన కారిడార్లలో ప్రయాణం కొంతవరకు సులభతర మైనప్పటికీ, మెట్రో స్టేషన్లలో దిగిన తర్వాత గమ్యస్థానాలకు చేరుకోవడం (లాస్ట్ మైల్ కనెక్టివిటీ)ప్రయాణికులకు సవాలుగా మారింది.ట్రాఫిక్‌ ఇబ్బందులు,సరైన ప్రజా రవాణా లేకపోవడం, క్యాబ్‌ల అధిక ఛార్జీల భారాన్ని తగ్గించేందుకు పర్సనల్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌ (PRTS)లేదా ‘పాడ్‌ ట్యాక్సీల’ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది.

ఈ ప్రాజెక్టుపై నిర్వహించిన అధ్యయనం అనంతరం కేపీహెచ్‌బీ – బయోడైవర్సిటీ,ఎల్బీ స్టేడియం – రాణిగంజ్,అసెంబ్లీ – బేగంపేట మార్గాలను ముఖ్యమంత్రి ఎంపిక చేశారు.ఈ మూడు మార్గాల్లో పీఆర్టీఎస్‌ సేవలను ప్రారంభించేందుకు వీలుగా, ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి టెండర్‌ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం మెట్రో రైలు అధికారులను ఆదేశించింది.

డ్రైవర్‌ లేకుండానే ప్రయాణం

పర్సనల్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌ (PRT)లో భాగంగా పాడ్‌ ట్యాక్సీల రాకపోకల కోసం ప్రత్యేకంగా ఎలివేటెడ్‌ ట్రాక్‌లను నిర్మిస్తారు. వాటిపై ఏర్పాటు చేసే గైడ్‌వేలు,ట్రాక్‌లపై ఈ వాహనాలు ప్రయాణిస్తాయి.మెట్రో రైళ్ల మాదిరిగానే వీటికి డ్రైవర్లు ఉండరు;పూర్తిగా స్వయంచాలకంగా,కేంద్రీకృత నియంత్రణ వ్యవస్థ ద్వారా ఇవి పనిచేస్తాయి.

చిన్న కారు ఆకారంలో ఉండే ఒక్కో పాడ్‌ ట్యాక్సీలో నలుగురు నుంచి ఆరుగురు ప్రయాణికులు కూర్చునే వీలుంటుంది.అవసరాన్ని బట్టి ఒకేసారి 15నుంచి 20మంది వరకు ప్రయాణించగలిగేలా గ్రూప్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ (GRT)వ్యవస్థను కూడా సమకూర్చుకునే అవకాశం ఉంది.ప్రయాణికులు పాడ్‌ కార్‌లో ఎక్కిన తర్వాత లోపల ఉండే టచ్‌పాడ్‌ సాయంతో తమ గమ్యస్థానాన్ని సులభంగా ఎంచుకోవచ్చు.

కాలుష్య రహిత వేగవంతమైన ప్రయాణం..

మెట్రో స్టేషన్లు,ఇతర ప్రధాన రవాణా కేంద్రాల నుంచి సమీపంలోని ఐటీ పార్కులు,కార్యాలయాలు,నివాస ప్రాంతాలకు సులభంగా చేరుకోవడానికి పాడ్‌ ట్యాక్సీలు ఎంతగానో ఉపయోగపడతాయి.పూర్తిగా బ్యాటరీతో నడుస్తాయి కాబట్టి వీటి వల్ల కాలుష్య బెడద ఉండదు.గంటకు 35నుంచి 44కిలోమీటర్ల వేగంతో ఇవి ప్రయాణించగలవు.

ప్రస్తుతం ప్రపంచంలోని ఆరు ప్రధాన ప్రాంతాల్లో వివిధ రకాల గైడ్‌వేలు,స్టేషన్ల డిజైన్లతో పీఆర్టీఎస్‌ సేవలు అందుబాటులో ఉన్నాయి.భూమిపై నడిచే ట్రాక్‌లతో పాటు గాలిలో కేబుల్స్,పైభాగపు ట్రాక్‌లకు వేలాడుతూ ప్రయాణించే వాహనాలతో కలిపి మొత్తం 8విభిన్న సాంకేతికతలతో ఈ వ్యవస్థలు పనిచేస్తున్నాయి.అయితే,మన వద్ద ఎలివేటెడ్‌ ట్రాక్‌ల డిజైన్‌కే అధికారులు మొగ్గు చూపుతున్నారు.

దేశంలో తొలిసారిగా ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌ (బీకేసీ)లో 8.5కిలోమీటర్ల పొడవైన ఎలివేటెడ్‌ పీఆర్టీ ప్రాజెక్టును చేపట్టారు.ప్రస్తుతం లండన్‌లోని హీత్రో విమానాశ్రయంలో వినియోగిస్తున్న ‘అల్ట్రా పీఆర్టీ’ సాంకేతికతనే ఇక్కడ కూడా వాడుతున్నారు.విశేషమేమిటంటే,యూకేకి చెందిన అల్ట్రా పీఆర్టీ సంస్థతో కలిసి హైదరాబాద్‌కు చెందిన సంస్థే ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును నిర్మిస్తోంది.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్