Magazines

25, 26 తేదీల్లో మల్టిపుల్ డేస్ మహాధర్నా

1 గంట క్రితం

on 25th and 26th
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 14, 2026 | 3 నిమిషాల చదవడం

పోస్టర్ ఆవిష్కరణలో పలువురు సీఐటీయూ నేతలు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

ఈ నెల 25,26 తేదీల్లో మల్టీఫుల్‌‌డేస్‌ ‌హైదరాబాద్‌‌లో మహాధర్నా నిర్వహించనున్నట్టు సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ ‌తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌‌లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో ఆ సంఘం నేతలతో కలిసి కార్యక్రమ పోస్టర్‌‌ను అవిష్కరించారు. ఈ సందర్భంగా భాస్కర్‌ ‌మాట్లాడుతూ కేంద్రలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలకు అనుసరిస్తున్నదని విమర్శించారు. ఆ విధానాలకు నిరసనగా కార్మిక వర్గం “మల్టిపుల్ డేస్ మహాధర్నా” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలోని సుమారు 2 కోట్ల మంది సంఘటిత, అసంఘటిత కార్మికవర్గం స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడిందని గుర్తు చేశారు.ఆ ప్రభుత్వాలు కార్మికులు ఎదుర్కుంటున్న సమస్యలను పరిష్కరించడంలో విఫలమైయ్యాయని విమర్శించారు. కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్‌‌లను తెచ్చి ప్రభుత్వరంగ సంస్థలను ధ్వంసం చేస్తుందని తెలిపారు. కనీస వేతనం పెరిగిన ధరలకు అనుగుణంగా పెంచకుండా కార్మికుల శ్రమను దోచుకోవడానికి పెట్టుబడిదారి వర్గానికి స్వేచ్ఛనిచ్చిందని విమర్శించారు. కేంద్ర కనీస వేతనాల సలహా మండలిలో కేంద్ర కార్మిక సంఘాలకు ప్రాతినిథ్యం ఇవ్వకుండా ప్రభుత్వ అనుకూల సంఘాలకు అవకాశం కల్పించటంలో అర్థమేంటని ప్రశ్నించారు. ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ మీటింగ్ ఎందుకు జరపడం లేదని నిలదీశారు. స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించడం లేదని, 12 ఏండ్లలో రూ. 25 లక్షల కోట్లు ప్రజాధనాన్ని పారిశ్రామికవేత్తలకు ధారపోసిందని విమర్శించారు. కార్మిక ఉద్యమాల పట్ల ఉక్కుపాదం మోపుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కార్మిక హక్కులు, సమస్యలు పరిష్కరించడంలో బీజేపీ ప్రభుత్వ అడుగుజాడల్లో నడుస్తున్నదన్నారు. నాలుగు లేబర్‌ కో‌డ్‌‌లను వ్యతిరేకించకుండా వాటికి రూల్స్ రూపొందించి అమలు చేయాలని ఉవ్విళ్ళూరుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో షాప్స్ అండ్‌ ఎస్టాబ్లిష్‌‌మెంట్‌ యాక్ట్స్ పరిధిలోని సంస్థల్లో 10 గంటల పని దినం అమలుకు జీఓ ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ విషయాన్ని కార్మిక సంఘాలతో ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. 2023లో ఎన్నికల సందర్భంగా కార్మికులకు ఎన్నో వాగ్దానాలు చేసిందని గుర్తు చేశారు.ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్‌‌సీ, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల పర్మినెంట్, స్కీం వర్కర్లు అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, ఐకేపీ, ఫీల్డ్ అసిస్టెంట్, బీడీ, ట్రాన్స్‌‌ఫోర్టు, భవన నిర్మాణం, హమాలీ, ఆర్టీసీ, సింగరేణి, విద్యుత్ వంటి అన్ని రంగాల వారికి జీతభత్యాలు పెంచుతామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు గడిచిందని తెలిపారు. ఏ ఒక్క సమస్య కూడా పరిష్కరించలేదన్నారు. మున్సిపల్ కార్మికుల పర్మినెంట్ గురించి పట్టించుకోవడం లేదని చెప్పారు. అవసరానికి అనుగుణంగా పోస్టులను పెంచి భర్తీ చేయడం లేదని తెలిపారు. గ్రామ పంచాయతీ కార్మికులకు నామమాత్రంగా రూ.9,500లు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత పీఆర్‌‌సీలో పెరిగిన వేతనాలను వీరికి వర్తింపజేయడం లేదని తెలిపారు. యూనివర్సిటీ ఉద్యోగులతో పని చేయించుకుని వీరికి రిటైర్‌‌మెంట్ బెన్ఫిట్ ను ఇవ్వడం లేదని చెప్పారు. కార్పొరేట్లు, పారిశ్రామికవేత్తల సేవలో మునిగి తేలుతున్నదని విమర్శించారు. ఈ నేపథ్యంలోనే “మల్టిపుల్ డేస్ మహాధర్నా"ను ఇందిరా పార్క్ వద్ద నిర్వహిస్తున్నామని తెలిపారు. 25న రాష్ట్రంలోని ప్రయివేట్ పరిశ్రమల కార్మికులు, ప్రభుత్వరంగ సంస్థల కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలపునిచ్చారు. 26న ప్రభుత్వరంగ సంస్థల్లోని ఉద్యోగులు, స్కీం వర్కర్లు , ఔట్‌‌సోర్సింగ్ ఎంప్లాయిస్, బీడి, భవన నిర్మాణం, ట్రాన్స్ పోర్ట్, హమాలీ తదితర అసంఘటిత కార్మికులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు అర్. సుధాభాస్కర్, మెడికల్ అండ్‌ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు భూపాల్, అంగన్వాడి యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. జయలక్ష్మి, బీడీ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ రమ, బిల్డింగ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగూరు రాములు, ఎస్‌‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.ఎస్ రావు, ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కె. ఈశ్వర్‌‌రావు, ట్రాన్స్‌‌ఫోర్టు ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుప్పాల శ్రీకాంత్, ఫిక్స్డ్‌ ‌టర్మ్‌ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూరపాటి రమేష్, గ్రామ పంచాయతీ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. సుధాకర్, వ్యవసాయ మార్కెట్ సెక్యూరిటీ గార్డ్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై. సోమన్న, ‌సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు రొయ్యల రాజు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్