2022 ఓటర్ జాబితాపై సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండీ అబ్బాస్
దానికి పార్లమెంటు ఆమోదం ఉందా అంటూ ప్రశ్న
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఎవరిని అడిగి 2022 ఓటర్ జాబితా నిబంధనను విధించారంటూ సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండీ అబ్బాస్ ఎన్నికల కమిషన్ జ్ఞానేశ్‌కుమార్‌ను ప్రశ్నించా రు. రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకు న్నారా? అందుకు పార్లమెంట్ ఆమోదం ఉందా? ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించారా? ఇవన్నీ లేకుండా ఎందుకు ఆ నిబంధన పెట్టారని నిలదీశారు. మంగళవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం (ఎస్‌వీకే) ఆధ్వర్యంలో ‘ఆచరణలో సర్ కుతంత్రాలేంటి?’ అనే అంశంపై వెబినార్ జరిగింది. దీనికి ఎస్‌వీకే మేనేజింగ్ కమిటీ కార్యదర్శి ఎస్ వినయకుమార్ సమన్వయకర్త గా వ్యవహరించారు. ఈ సందర్భంగా అబ్బాస్ మాట్లాడుతూ ఓటర్ జాబితాలో రెండు ఓట్లు ఉన్నా...చనిపోయిన వ్యక్తులు ఉన్నావారి పేర్లను ఓటర్ జాబితాలో నుంచి తొలగించడం సహజ ప్రక్రియ అన్నారు. దాన్ని ఎవరూ ప్రశ్నించడం లేదన్నారు. కానీ ఎన్నికల కమిషన్ చిన్న, చిన్న కారణాలతో ఓట్లు తొలగించడం సరైందికాదన్నారు. అక్షరదోషా లు, ఇంటిపేరు లో తప్పులు చూపించి ఓట్లు తొలగించే అధికారం ఎన్నికల కమిషన్‌కు ఉందా? అని ప్రశ్నించారు. బీజేపీకి ఓటు వేయరన్న అనుమానం ఉన్నా ప్రతి ఒకర్ని ఫామ్ 7ను అడ్డం పెట్టుకుని ఓట్ తొలగించేం దుకు బీజేపీ పెద్ద కుట్ర చేస్తున్నదని విమర్శిం చారు. అనేక రాష్ట్రాల్లో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ బీఎల్‌వోలపై ఒత్తిడి చేసి, ఫామ్ 7లో మార్పులు చేయిస్తున్నారని తెలిపారు. బీహార్, మహా రాష్ర్ట, పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాల్లో ఈ విషయం బయటపడిందని గుర్తు చేశారు. ఎన్నికల చట్టం ప్రకారం ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఓటర్ల జాబితా సిద్ధం చేస్తారని, కానీ బీజేపీ అధికారంలోకి వచ్చాక ఈఆర్‌వో నుంచి బీజేపీ ఐటీ సెల్‌కు చేరిందని తెలిపారు. 93 లక్షల మంది నోటీసులకు సమాధానం ఇచ్చి నా, ఓట్ ఉండాలా? తొలగించాలా? అనేది బీజేపీ ఐటీసెల్‌పై ఆధారపడి ఉంటుందని ఆం దోళన వ్యక్తం చేశారు. నోటీస్ రాని వారికి కూడా తన ఓటు ఉంటా? లేదా? ప్రమాదమేన న్నారు. ప్రజలు తమ ఓటు హక్కు ఉంటుం దా? పోతుందా? అనే అభద్రతాభావంలో ఉన్నారని చెప్పారు. ఓటర్‌ను అనుమానిస్తూ... అవమానిస్తూ... ఓటు హక్కు లేకుండా చేస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని ఎన్నికల సంఘం దెబ్బతీస్తున్నదని తెలిపారు. ఓట్లు లేకుండా చేసి ఆ తర్వాత సంక్షేమ పథకాల్లో కోత పెట్టుందుకు బీజేపీ కుట్ర చేస్తున్నదని విమర్శించారు. బీజేపీకి అనుబంధ సంఘంగా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తోందని చెప్పారు. ఆ పార్టీని గెలిపించేందుకు ఎన్నికల కమిషన్ తప్పుడు సమాధానాలు చెబుతున్నదని తెలిపారు. ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ ఓటర్లకు చేస్తున్న మోసాలు, దారుణాలు అన్నీ ఇన్నీ కావని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ఆయన రాజీనామా చేయాలని ప్రజలు కోరుతున్నారని చెప్పారు. ఆయన రాజీనామా కోసం ఢిల్లీ జంతర్‌మంతర్‌లో జరుగుతున్న ఉద్యమంపై బీజేపీ అత్యంత దాష్టీకంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. మహిళ లు, చిన్న పిల్లల పట్ల అమానుషంగా వ్యవహరి స్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు ఫేక్ పోలీసుల వేషంలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు. దేశంలో అంతర్యుద్దా నికి బీజేపీ సిద్దపడుతున్నదని విమర్శించారు. బీజేపీ అర్ధఫాసిస్టు స్వభావంతో ప్రజలపై దాడి చేస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాం టి దారుణాలను ఎన్డీఏ కూటమిలో భాగస్వా మిగా ఉన్న బిజూ పట్నాయక్ కూడా ఖండిం చారని గుర్తు చేశారు. ప్రజాస్వామ్య రక్షణ కోసం ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.






కామెంట్‌లు (0)