Magazines

అందరికీ రిలేట్ అయ్యే సినిమా

4 గంటల క్రితం

film
avatar
balaji

ప్రచురించబడింది నవం 10, 2026 | 1 నిమిషాల చదవడం

వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్స్, ఈటీవీ విన్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘ఇంకా ఏం అనుకోలేదు!’. వంశీ నందిపాటి నిర్మాతగా కన్ను సమీర్, వెన్నపూస శ్రీకర్ రెడ్డి సహ నిర్మాతలుగా ప్రణయ్ వల్లూరిపల్లి, గిరి పెమ్మసాని సంయుక్తంగా తెరకెక్కించిన ఈ మూవీలో అక్షయ్ లగుసాని, కేయూరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాని డిసెంబర్ 11న విడుదల చేయబోతు న్నారు. ఈ క్రమంలో ‘మేఘాలు సంద్రంలో’ అంటూ సాగే పాటను లాంచ్ చేశారు. నిర్మాత వంశీ నందిపాటి మాట్లాడుతూ, ‘ఈ చిత్రం అందరికీ రిలేట్ అయ్యేలా, కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. గిరి, ప్రణయ్ చెప్పిన ఈ కథ నాకు ఎంతో నచ్చింది. ఈ ఇద్దరి పేర్లు ఇండస్ట్రీ కచ్చితంగా గుర్తు పెట్టుకుంటుంది. సింజిత్ అద్భుతమైన పాటల్ని ఇచ్చాడు. అక్షయ్, సింజిత్ మంచి స్నేహితులు.

కేయూరికి ఆల్ ది బెస్ట్. ఈటీవి విన్‌తో కలిసి ఈ మూవీని డిసెంబర్ 11న ఆడియెన్స్ ముందుకు తీసుకు వస్తున్నాం’ అని అన్నారు. ‘ఇది మాకెంతో ప్రత్యేకమైన సినిమా. ఈ చిత్రంతో ఒకేసారి ఇద్దరు దర్శకుల్ని పరిచయం చేయబోతోన్నాం. వంశీకి నిర్మాతగా ఇదే తొలి చిత్రం’ అని ఈటీవీ విన్ కంటెండ్ హెడ్ భరణ్ చెప్పారు. ‘మాకు సింజిత్ ఎప్పుడూ మంచి పాటల్నే ఇస్తుంటాడు. ఈ సినిమాకి కూడా సింజిత్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. వంశీ నందిపాటిని నిర్మాతగా పరిచయం చేస్తుండటం ఆనందంగా ఉంది’ అని ఈటీవీ విన్ వైస్ ప్రెసిడెంట్ సాయి కృష్ణ తెలిపారు. దర్శకుడు ప్రణయ్ వల్లూరిపల్లి మాట్లాడుతూ, ‘అద్భుతమైన కథతో రూపొందిన మా సినిమా అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాం’ అని అన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్