Magazines

ఈ ట్రెండ్‌కి కనెక్ట్‌ అయ్యే కథ

1 రోజు క్రితం

this trend
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 09, 2026 | 1 నిమిషాల చదవడం

మైత్రీ మూవీ మేకర్స్ ‘డీఎన్‌కే’ వంటి మరో ఎంటర్‌ టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మౌళి తనూజ్ ప్రశాంత్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తుండగా, అనిల్ యెర్నేని కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.

శ్రీను కంబాల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవు తున్నారు. ఈ సినిమా ఈనెల 13న సినిమా థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో తాజాగా హీరో రవితేజ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.

ఆన్‌లైన్ బెట్టింగ్‌కు అలవాటు పడిన హీరో, ఆన్‌లైన్ లోన్ యాప్‌ల ద్వారా అప్పులు చేయడంతో పాటు తన గర్ల్‌ఫ్రెండ్ దగ్గర కూడా డబ్బులు తీసుకుని ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంటాడు. ఈ క్రమంలో డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ గర్ల్‌ఫ్రెండ్ తండ్రి అతడి ఇంటికి వచ్చి గట్టిగా హెచ్చరిస్తాడు. అప్పులు పెరిగిపోవడం, వాటిని తీర్చే మార్గం కనిపించకపోవడంతో హీరో తన స్నేహితుడితో కలిసి ధనవంతుల ఇళ్లలో దొంగతనాలు చేయాలని నిర్ణయించుకుంటాడు.

మరోవైపు వరుస దొంగతనాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించి, వీటి వెనుక బీహార్‌కు చెందిన ముఠా ఉందని అనుమాని స్తారు. ఆ తరువాత ఏం జరిగిందనే ఉత్కంఠను ట్రైలర్‌ క్రియేట్‌ చేసింది. ప్రస్తుత యువతకు బాగా కనెక్ట్ అయ్యే కథాంశాన్ని దర్శకుడు శ్రీను కంబాల ఎంచుకున్నారు.

కామెడీ, రొమాన్స్, దొంగతనాల నేపథ్యంలో కథను నడిపిస్తూనే ఒక మంచి సామాజిక సందేశాన్ని కూడా అందించే ప్రయత్నం చేసినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ‘లిటిల్ హార్ట్స్’ సినిమాలో తన ఎనర్జిటిక్ నటనతో గుర్తింపు తెచ్చుకున్న మౌళి తనూజ్ ప్రశాంత్ ఈ సినిమాలో తన పాత్రలో చక్కగా ఒదిగిపోయారు. ప్రతి సన్నివేశంలోనూ తనదైన కామెడీ టైమింగ్‌తో నవ్వులు పూయించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్