Magazines

‘ధర్మన్’లో మరో క్రేజీ స్టార్‌

1 రోజు క్రితం

Another big star in ‘Dharman’
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 09, 2026 | 1 నిమిషాల చదవడం

సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘ధర్మన్‌’. ఈ చిత్రంలో ప్రముఖ టాలీవుడ్‌ స్టార్‌ రామ్ పోతినేని భాగమయ్యారు. డైనమిక్ స్క్రీన్ ప్రెజెన్స్, ఆకట్టుకునే నటన, ప్రత్యేక మైన ఎనర్జీతో రామ్ పోతినేని తెలుగు ప్రేక్షకుల్లో తన కంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ‘దేవదాస్’తో గుర్తుండిపోయే అరంగేట్రం చేసిన ఆయన, ‘రెడీ’, ‘కందిరీగ’, ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి పలు విజయవంతమైన చిత్రాలతో ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. వరుస విజయాలతో ప్రేక్షకులని అలరిస్తున్నారు. రామ్ ఎంట్రీని ప్రకటిస్తూ విడుదల చేసిన గ్లింప్స్‌లో స్టైలిష్ సర్‌ప్రైజ్ ఉంది. రజనీకాంత్, రామ్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించి, అందర్నీ మెస్మరైజ్‌ చేశారు.

ఈ సినిమాతో రామ్‌ తమిళ చిత్రసీమలోకి అడుగుపెడుతున్నారు. అంతేకాదు, తొలిసారి రజనీకాంత్‌తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ అన్ని భాషల ప్రేక్షకులకు ఆసక్తికరమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అందించనుంది. అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నయనతార, శ్రీలీల కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్